Ultimate magazine theme for WordPress.

జిల్లా మంత్రులు నల్గొండ జిల్లాలో మంచినీటి సమస్య లేకుండా జర చూడండి బి ఆర్ ఎస్ నాయకులు బడుగు లింగయ్య యాదవ్, భాస్కరరావు, విజయసింహారెడ్డి డిమాండ్

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి..

*మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యులు మరియు నల్లగొండ పార్లమెంటు ఎన్నికల మిర్యాలగూడ నియోజకవర్గ సమన్వయకర్త బడుగుల లింగయ్య యాదవ్ , మాజీ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు  మరియు రాష్ట్ర ఆగ్రోస్ మాజీ ఛైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి  పాల్గొని మాట్లాడారు*.

 

*ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుంది అని, 4 నెలలలోనే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది అని, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సాద్యం కానీ హామీలను, ఆరు గ్యారెంటీలను ఇచ్చి ప్రజలను మభ్య పెట్టారు అని, సాగు నీరు, త్రాగు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని, ఈ 4 నెలల పాలనలో ప్రజలు పగటి పూటే చుక్కలు చూస్తున్నారు అని, 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ తప్ప చేసింది ఏమీ లేదు అని, కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఏం అయ్యింది అని, రైతుబంధు ఎకరాకు రూ. 15,000, కౌలు రైతులకు ఎకరాకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్,18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. అదేవిధంగా ఆసరా పెన్షన్ రూ. 4000 కు పెంచుతామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇయ్యలేదు. డిసెంబర్ 9న ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఋణ మాఫీ ఊసే లేధు అని. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇటీవలే సీఎం రేవంత్ ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానన్న విషయాన్ని గుర్తు చేశారు, మాజీ ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ గారు ఈ నెల 24వ తేదీ మిర్యాలగూడ నుంచి ప్రారంభించిన బస్ యాత్ర కు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు అని తెలిపారు. తెలంగాణలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతున్నాం అని భయం పట్టుకున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఈసీ కు పిర్యాదు చేసి కేసీఆర్ బస్సు యాత్రను అడ్డుకుంటున్నారు అని తెలిపారు. రేవంత్ రెడ్డి దుష్పాదజాలం ఈసీ కు ఎందుకు కనిపించట్లే అని ప్రశ్నించారు, అదేవిధంగా ఈనెల 13న జరిగే పోలింగ్ లో నల్లగొండ జిల్లా పార్లమెంటు అభ్యర్థి కంచర్ల క్రిష్ణారెడ్డి గారిని గెలిపించాలని కోరారు*..

 

*నల్లమోతు భాస్కర్ రావు  మాట్లాడుతూ కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సస్యశ్యామలంగా ఉండేది అని, నాలుగు నెలలోనే ప్రజలకు ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగింది.. ఒకవైపు నీళ్లు లేక కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పట్టించుకునే నాధుడే కరువాడని ఆవేదన వ్యక్తం చేశారు.. పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నల్లగొండ జిల్లా పార్లమెంటు అభ్యర్ధి కృష్ణా రెడ్డి గారిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు*

 

*కార్యక్రమంలో జిల్లా డీసీఎంస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, దామరచర్ల జడ్పీటీసీ అంగోతు లలిత హాతీరాం, అడవిదేవులపల్లి ఎంపీపీ బాలాజీ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిట్టిబాబు నాయక్, మాజీ వైస్ ఛైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, బిఆర్ఎస్ నాయకులు నిమ్మల నవీన్ రెడ్డి, కరీం, లక్ష్మీ నారాయణ, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, పిస్కే ప్రసాద్, బిక్షం గౌడ్, అసిమ్, మాజీ సర్పంచ్లు రవీందర్ నాయక్, సాయన్న, సచిన్, ప్రకాష్ నాయక్, రవి నాయక్, కనిగిరి శ్రీను, విష్ణు, వినోద్, వేణు గోపాల్, ఏడుకొండల్, ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు*..

post bottom

Leave A Reply

Your email address will not be published.