.. లెక్కింపు కేంద్రాల పరిశీలించిన ఎన్నికల అధికారులు
మిర్యాలగూడ ప్రజాలహరి..
నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న లోక సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గురువారం కేంద్ర ఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి, కళ్యాణ్ కుమార్ దాస్, ఆమోగ్ జీవన్ గాంకర్లు జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తిలతో కలిసి గురువారం తనిఖీ చేశారు.
ఈ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కై ఏర్పాటు చేసిన బారికేడింగ్, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు హాళ్లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మానిక్ రావ్ సూర్యవంశి ఓట్ల లెక్కింపుకు వినియోగించనున్న టేబుల్లు, పోలింగ్ కేంద్రాలు, సిసి టీవీల ఏర్పాటు తదితర వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు .