
” జనం కోసo జనయేత్రి* జనంతోనే జనయిత్రి ”
*ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి.
మిర్యాలగూడ , ప్రజాలహరి…
సేవా దృక్పథంతో ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మునీర్ అహ్మద్ షరీఫ్ అన్నారు. ప్రతి నెల మొదటి తారీకున మిర్యాలగూడ లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో భాగంగా మేడే రోజు చైతన్య నగర్ లో చౌదరి ఫంక్షన్ హాల్ లో నడుస్తున్న పతంజలి నిత్య యోగ సెంటర్ వారు మరియు జనయేత్రి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొని తమ ఫౌండేషన్ ద్వారా వైద్య శిబిరాలు నిర్వహించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పతంజలి యోగ సెంటర్ నిర్వాహకులు నాగేందర్ గారు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకొని వైద్యుల సలహాలతో మంచి మందులు వాడుతూ జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలని కోరారు. ఈరోజు ఈ వైద్య శిబిరంలో సుమారు 70 మందికి బీపీ షుగర్ మరియు థైరాయిడ్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. మిర్యాలగూడ లోని విజన్ కంటి వైద్యశాల నిర్వాహకులు జాఫర్ గారు మాట్లాడుతూ ప్రజలు వైద్య శిబిరాలలో పాల్గొని తమకు ఉన్న జబ్బులో సంబంధించి ఉచిత సలహాలు సూచనలు తీసుకొని కొద్దిపాటి మందులతో జీవిత కాలాన్ని మెరుగుపరుచుకోవడానికి జనయేత్రి ఫౌండేషన్ చేస్తున్న సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు. జనయేత్రీ ఫౌండేషన్ కార్య నిర్వాహ అధ్యక్షుడు పోగుల సందీప్ మాట్లాడుతూ ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తించి సభ్యులుగా చేరి తమ సంస్థ కి చేయూత ఇవ్వాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో నాగేందర్ శ్రీనివాస్ కిరణ్ రెడ్డి నాగిరెడ్డి యోసన్న రెడ్డి మంగాదేవి లక్ష్మి జ్యోతి రమ కుమారి వసంత పద్మ రాజ్యలక్ష్మి విజయ అరుణ అలివేలు జయ సౌమ్య నాగరాణి లావణ్య మరియు జనయేత్రీ ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి,యాదగిరి కృష్ణ సాహిర్ సాయి అఖిల్ చరణ్,మదీహ ఫాతిమా,వరలక్ష్మి, నసీమున్నీసా తదితరులు పాల్గొన్నారు.