భారీ మెజార్టీతో గెలిపించండి. బాధ్యతగా పనిచేస్తా; రఘువీర్ రెడ్డి
వేములపల్లి (ప్రజాలహరి) నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం లో, భారీ మెజార్టీతో గెలిపించండి, బాధ్యతగా పనిచేస్తామని నల్గొండ పార్లమెంటు అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. బుధవారం వేమనపల్లి మండలంలోని రోడ్డు షేల్లో భాగంగా, ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించినట్లయితే పార్లమెంటు నియోజకవర్గం అత్యధిక నిధులు తెచ్చి అభివృద్ధి పదంలో ముందంజలో ఉంటానని ఆయన అన్నారు. అంతే కాకుండా రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి దేశంలో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో ముందంజలో ఉంచాలని ఆయన అన్నారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో మండల వ్యవస్థను తీసుకొచ్చింది నేనే అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, తీన్మార్ మల్లన్న, నాగార్జునసాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిసిసి సభ్యులు చిరుమ,ర్రి కృష్ణయ్య, తమ్ముడైన అర్జున్, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ ,ఎంపీపీ సునీత తదితరులు పాల్గొన్నారు