ఎస్ఎస్సి ఫలితాల్లో సెయింట్ జాన్స్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం
ప్రజాలహరి, మిర్యాలగూడ.. ఎస్ ఎస్ సి పరీక్ష ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణంలోని సెయింట్ జాన్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు
మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ లో ఉన్న సెయింట్ జాన్స్ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా 10 జీపీఏ సాధించిన మదీహ ను పాఠశాల ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి స్వీట్లు తినిపించి అభినందించారు. పాఠశాల విద్యార్థులు 9.8 జీ పీ ఏ14 మంది సాధించారు. వారిలో నిత్య రూపి ని, అశ్విత, అస్మిక, కౌశిక్ , శ్రీనిధి, నక్షత్ర, అన్షిత, కరుణ్ , సాయి కృష్ణ, చరణ్, సాయి జస్వంత్, శరణ్య ఉన్నారు. 9.7 జిపిఏ 11 మంది విద్యార్థులు సాధించగా వారిలో తన్వి శ్రీ, శ్రీ చందన, సానియా, గోపీనాథ్, హారిక, సాద్విక్, హన్సిక , వాగ్దేవి, మహేందర్ రెడ్డి ఉన్నారు. 9.5 జిపిఏ సాధించిన 18 మంది విద్యార్థులు హర్షిత, సాయి చరణ్, యాసిన్, వినోద్, సాత్విక్, దివ్యశ్రీ ,శివ, 9. 0 జిపిఎస్ సాధించిన 13 మంది విద్యార్థులు ఉన్నారు. నూరు శాతం ఫలితాలు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల స్థాపించిన 24 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం నూరు శాతం ఫలితాలు సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ వారు పేర్కొన్నారు.