నల్లగొండ పార్లమెంట్ సీటుకు పోటీ చేసే అభ్యర్థులు మిర్యాలగూడ నియోజవర్గానికి ఏ మహామిలిస్తున్నారో వాటి వివరాలు చెప్పండి ..
****నలగొండ పార్లమెంట్ నియోజకవర్గ నుంచి పోటీ చేసే అభ్యర్థులు మిర్యాలగూడ నియోజకవర్గానికి ఏం చేస్తారో అభివృద్ధి కార్యక్రమాలు వివరాలు చెప్తారా??..
.****నియోజకవర్గ వర్గాల వారిగా నల్గొండ పార్లమెంట్ మేనిఫెస్టో ఎక్కడ ప్రజలకు పంచండి….
మిర్యాలగూడ ప్రజాలహరి..
నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ,భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ సంబందించిన అభ్యర్థులు మిర్యాలగూడ నియోజకవర్గానికి మీరు గెలిస్తే ఏం చేస్తారో ప్రత్యేకమైన ఎన్నికల మేనిఫెస్టో ఉంటే వాటిని పత్రిక ముఖ్యంగా గాని కరపత్ర రూపంలో గాని పంచ గలరు అని ప్రజలు కోరుతున్నారు గత నెల రోజులుగా పార్లమెంటు అభ్యర్థుల పార్టీలు సన్నహాక సమావేశాలు, కార్యకర్తలు పరిచయ వేదికలు ,చేరికలతో హడావుడిగా పరుగులు తీస్తున్నారు. నామినేషన్లతో పాటుగా కానీ మేము గెలిస్తే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలాని నియోజకవర్గానికి ఇవి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మాత్రం ప్రత్యేకంగా చెబుతున్నట్టు దాఖలాలు కనిపించడం లేదు .ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి నిధుల కొరత రాష్ట్ర, జాతీయ స్థాయి నిధుల వరద రావడం లేదు. దీనిపై మూడు పార్టీల అభ్యర్థులు కుందూరు రఘువీర్ రెడ్డి ,కంచర్ల కృష్ణారెడ్డి, శానంపూడి సైదిరెడ్డిలో ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించి ఉంటే ప్రజల ముందు బహిర్గతం చేయాలని ఈ సందర్భంగా పలువురు మేధావులు కోరుతున్నారు. ముఖ్యంగా మిర్యాలగూడలో బైపాస్ మీద తరచూ ప్రమాదాలు జరిగి రెండు సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. అందువలన ఆరు చోట్ల అండర్పాసులు కావాలి. రెండు మిర్యాలగూడ విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధి ఉన్నది దీన్ని విస్తరణ చేయాలంటే మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పై మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు అవసరము దానికోసం ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. పట్టణము ఒకే చోట కేంద్రీకరించబడుతుంది. దీని విస్తారంగా శాకోప శాకాలుగా అభివృద్ధి చేయడానికి కావలసిన సూచనలు చేయాల్సిన కార్యక్రమాలు మీరు ప్రకటించాలి మా పార్టీ అభ్యర్థి అంటే మా పార్టీ అభ్యర్థిని 30 వేల మెజార్టీ 50 వేల మెజార్టీ లక్ష మెజార్టీతో గెలిపిస్తాము అనటం వాగ్దానాలు కాకుండా నియోజకవర్గానికి కావలసిన శాశ్వత ప్రతిపాదికన కావాల్సిన అభివృద్ధి నిధులు కేటాయించాలి. పాత స్కీములు కాకుండా కొత్త స్కీములు మంజూరు చేయించాలి పాత స్కీములకు మళ్ళీ రంగు రంగు వేయొద్దు ఇది అన్ని పార్టీల ఆలోచించాలి ఇది విమర్శాత్మకంగా తీసుకోకూడదు ఆచరణాత్మకమైన కార్యక్రమాలుగా స్థానికంగా ఉన్న అధికార ,విపక్ష జాతీయ పార్టీ నాయకులు లోతుగా ఆలోచించి ఇవి చేస్తాం అని పార్లమెంట్ అభ్యర్థుల చేత ప్రకటనలు సభాముఖంగా చేయించాలి. మిర్యాలగూడ నియోజకవర్గంలో దాదాపు సిమెంట్ ఫ్యాక్టరీలు కెమికల్ డ్రగ్స్ ,యాదాద్రి పవర్ ప్లాంట్ ఫ్యాక్టరీలైతే ఉన్నాయి కానీ ఇక్కడ ప్రభుత్వ పాలిటెక్నిక్, గాని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు ..ఈ విషయాన్ని ప్రస్తుత ఎంపీ అభ్యర్థులు దృష్టి సారించాలి ఎందుకు స్థానికంగా ఉన్న ప్రజా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రులు ఆలోచన చేసి నిధులు మంజూరు చేయించాలి.. మిర్యాలగూడ నియోజకవర్గం చుట్టూ కృష్ణానది ,మూసీ నది ప్రవహిస్తున్నది ఇది ఆధ్యాత్మిక తీర ప్రాంతం కూడా ఈ విషయాన్ని పార్లమెంట్ అభ్యర్థుల దృష్టికి స్థానిక ప్రజా ప్రతినిధులు తీసుకువెళ్లి ఆధ్యాత్మికంగా కూడా డెవలప్ చేయడానికి కావలసిన సూచనలను ఎన్నికల జెండాలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది..