Ultimate magazine theme for WordPress.

చేరికలతో ఎవరికి లాభం ఎవరికి నష్టం ఈ బేరిజులు ఎవరు వేయాలి

Post top

చేరికలతో కాంగ్రెస్కు లాభం కంటే చేరిన వారికి వ్యక్తిగత ప్రయోజనాలకే లాభం ఎక్కువ..ప్రజాలహరి, మిర్యాలగూడ…. ఈ పక్షం ,ఆ పక్షం స్వపక్షం -విపక్షం అనేది తేడా లేకుండా అధికారమే లక్ష్యంగా అందరూ రాజకీయ నాయకులు పనిచేస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మిర్యాలగూడ రాజకీయాలే. పార్లమెంటు ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది నలగొండ పార్లమెంట్ పరిధిలో రాజకీయాలు గమ్మత్తు, వేడి నెక్కిస్తున్నాయి.. ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో చేరికల ప్రభావం స్వపక్షాన్ని ,విపక్షాన్ని అయోమయం గదరగోళానికి గురిచేస్తున్నాయి. ప్రజల విజ్ఞప్తులు దాసోహము అధికారుల  వoది  మాగాదుల సోత్రాలకు ప్రస్తుత రాజకీయ నాయకులు అధిక ప్రాధాన్యం ఇసన్నారు. ఈ సోత్రాలు, అష్టోత్తరాలు కే అధిక ప్రాధాన్యమిస్తూ పార్టీ ఏదైనా అధికారమే మనం  లక్ష్యంగా ప్రస్తుత రాజకీయ నాయకులు పనిచేయటం మనము తెలంగాణలో అధికంగా చూస్తున్నాము.. గత ప్రభుత్వం ఓడిపోయిన మరుక్షణ నుంచి అధికార పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు  అందరూ తమ తమ గత ప్రభుత్వ వస్త్రాలను వదిలి, నూతన ప్రభుత్వ సంబంధించిన వస్త్రాలను ధరిస్తూ స్టేజి మీద తమ నటన విన్యాసాన్ని విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు… ఈ విషయాన్ని వాస్తవాలను గ్రహించలేని సామాన్య కార్యకర్తలు సామాన్య ప్రజలు వ్యక్తిగతంగా తీసుకొని చేరికలపై రోడ్ల మీదకు వచ్చి  త్రివ స్థాయిలో విరుచుకుపడుతున్నారు .అసలుదారులేము నలుగురు నవ్విపోటు నాకేమిటి అన్నట్టుగా ఉంటున్న జెండా మోసిన కార్యకర్త మాత్రం ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. ముందు మారాల్సింది కార్యకర్తలు కాదు. నియోజకవర్గాల ఇన్చార్జులు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ,ఎంపీలు, జిల్లా పార్టీలు, రాష్ట్ర పార్టీలు, గ్రామ శాఖలు మండల శాఖలు, మార్పు రావాలి.  ఈ విధానము గతంలో కమ్యూనిస్టు పార్టీలో ఉండే గ్రామ శాఖ తీర్మానం లేకుండా రాష్ట్రస్థాయి కానీ నియోజకవర్గం నాయకుడు కానీ చేరాలంటే గ్రామ శాఖ తీర్మానం ఉంటేనే పార్టీలు చేర్చుకుని కానీ నేడు అన్ని రాజకీయ పార్టీలు గ్రామ శాఖలో నిర్వీర్యం చేస్తూ హైదరాబాదు కేంద్రంగా, నల్లగొండ కేంద్రంగా సంకుచికిత రాజకీయాలు చేస్తూ చేరికలకు ఆజ్ఞ పోస్తూ వాపసి ఘర్ అనే విధానాలు చేస్తూ రాజకీయ విశ్లేషణ , తటస్తులు ఉండే వ్యక్తులను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఈ విశ్లేషణపై ఉపోద్ఘాతం కారణం మిర్యాలగూడలో జరిగిన పరిణామాలే కారణం. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు ముందుగా రియలైజేడ్ కావాలి గ్రామాల అభివృద్ధి, పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ,స్వలాభం స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా.. ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది

నాయకులు సరియైన విధానాలు అవలంబించకపోతే నాయకుడు నియోజకవర్గ కేంద్రాల్లో ఉంటాడు మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలు పోలీసు భద్రతలో సుఖమైన జీవనం కొనసాగిస్తుంటారు కానీ గ్రామంలో మాత్రం కార్యకర్తకు ఈ సౌకర్యాలు ఉండవు వారు జీవితాలని  ఒక్కొక్కసారి పన్నంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది

ఇప్పటికైనా రాజకీయ నాయకుడు మారకపోతే భవిష్యత్తు తరం లో కార్యకర్త అనేవాడు పార్టీకి ఉండకుండా పోతాడు…

మిర్యాలగూడలో పలువురు చేరిక పై మిన్నంటిన నిరసనలు  మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ పలువురు కౌన్సిలర్లు బిఆర్ఎస్ న వీడి  అధికార పక్షంలో చేరడంపై గ్రామస్థాయి వార్డు స్థాయి నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున నిరసనలు పె ల్లుబుక్కాయి ఇందుకు కారణం లేకపోలేదు అధికారం ఎటువైపు ఉంటే అటు ఉండటంపై ఇoదుకు కారణం… ఈ నిరసనలను బట్టి ప్రస్తుత అన్ని పార్టీ నాయకులు వ్యక్తిగతంగా విశ్లేషించుకోవాలి తాము ప్రజల్లో ఏమాత్రం బలం ఉన్నాము ప్రజలు ఎటువైపు చూస్తున్నారు ప్రజలను మనల్ని గమనిస్తున్నారు మనము అధికారము శాశ్వతం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకుంటూ ప్రజలకు సేవ చేయాలనే వైపు ఆలోచన చేస్తే స్వతంత్ర అభ్యర్థులుగా అయినా భవిష్యత్ కాలంలో విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయని విషయాన్ని ఎవరైనా విస్మరించకూడదు.

ప్రజా సవే లక్ష్యం బిఎల్ఆర్ ప్రత్యక్ష ఉదాహరణ…  బి ఎల్ ఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన సమయంలో ప్రజల నుంచి కానీ రాజకీయ పార్టీల నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి గాని సహకారం లేకపోయే అయినా వాటిని భరిస్తూ స్వచ్ఛంద కార్యక్రమాలను ముందుకుతీసుకువెళ్తూ ప్రజల్లో మమేకమయ్యారు. సుమారు 6 నుంచి 8 సంవత్సరాల పాటు నిరంతరం ప్రజాసేవలో కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు అనే భేదాలు లేకుండా ప్రజలతో మమేకవైపు వారి వారి సాంప్రదాయాలకు విలువలు ఇచ్చుకుంటూ వారి వారి అవసరాలకు వారు వారి మతాలకు సంబంధించిన దేవాలయాలు, చర్చిలు మసీదులు ఇతరత్న నిర్మాణ సందర్భంలో అన్నదానాలు చేయడం ఒక ప్రత్యేకమైన నూతన వ్రోడిని సృష్టించారు .అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు నుంచి తమను తమను కాపాడే హెల్మెట్లు పంపిణీతో శిఖరాగ్ర  భాగన నేడు చేరారు .వేసవి కాలంలో ప్రజలకు మంచినీరు, మజ్జిగ దద్దోజనం లాంటి సాయ సహకారాలు కూడా అందించారు అంతేకాకుండా మృతి చెందిన కుటుంబాలకు అంత్యక్రియలకు ప్రత్యేక వాహనం మరియు భోజన పదార్థాలు ఆరోజు వరకు అందించే వినూతన కార్యక్రమానికి శ్రీకారం చెప్పారు.. ఇలా చెప్పుకుంటూ పోతే పలు కార్యక్రమాలు చేపట్టారు బత్తుల లక్ష్మారెడ్డి అధికారం కోసం కాకుండా ప్రజాసేవ సంకల్పం  ప్రజాసేవ చేశారు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేగా ప్రజాప్రతిథిగా నిలబడి  ఈ విషయాన్ని మిర్యాలగూడ తో పాటు నల్గొండ జిల్లాలో ఉన్న ప్రజలు రాజకీయ నాయకులు అందరూ గ్రహించాలి.

 

post bottom

Leave A Reply

Your email address will not be published.