కాంగ్రెస్ నాయకులు తమ స్థాయి దిగజారి, లేని స్థాయి కోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు.. బిఆర్ఎస్ నాయకు

మిర్యాలగూడ ప్రజాలహరి
..జిల్లా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి & మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అని, మిర్యాలగూడ నియోజకవర్గ బి ఆర్ ఎస్ నాయకులు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. జగదీశ్వర్ రెడ్డి మిర్యాలగూడ, తెలంగాణ మొత్తానికి మనీ మక్కుటమైన యాదాద్రి పవర్ ప్లాంట్ తీసుకొచ్చిన విషయాన్ని మంత్రులు మర్చిపోవటం బాధాకరమని 10 సంవత్సరాల కాలంలో ఏనాడూ రైతులు కరెంటు కోతలకు గాని నీటి సమస్యతో గానీ అల్లాడా లేదని విషయాన్ని ప్రస్తుత అధికార పార్టీ నాయకులు విస్మరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు గొప్పలు చెప్పుకుంటున్న కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలు ఏం అభివృద్ధి చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడం లో విఫలం అయ్యాయరని, భాస్కర్ రావు గారి హయంలో మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ది చెందింది అని తెలిపారు.. మొన్నటి వరకు అధికార పార్టీ లో ఉండి, మీ కుటుంబ సభ్యులు వివిధ పదవులు, హోదాలు అనుభవించి, ఇప్పుడు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అదికారం కోల్పోగానే, పార్టీ ఫిరాయించిన వారు ఇలా అసత్య, నిరాదరణ, వ్యక్తిగత దూషణలు చేయడం ఎంతవరకు సబబు కాదు అని, ఈ సందర్భంగా తప్పుడు ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీ నందు గల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో దామరచర్ల జడ్పీటీసీ అంగోతు లలిత హాతీరాం, అడవిదేవులపల్లి ఎంపిపి బాలాజీ నాయక్, బిఆర్ఎస్ నాయకులు కుందూరు వీరకోటి రెడ్డి, బైరం సంపత్, మాలవత్ రవీందర్ నాయక్, లావూరి శ్రీను నాయక్, పున్నా నాయక్, ప్రకాష్ నాయక్, సచిన్ నాయక్, వినోద్ నాయక్, దస్రు నాయక్, కుర్ర శ్రీను నాయక్, పాచు నాయక్, వీర నాయక్, లింగా నాయక్, పిన్న బోయిన శ్రీనివాస్ యాదవ్ ఫయాజ్, కొండల్, తదితరులు పాల్గొని మాట్లాడారు..