మిర్యాలగూడ కు ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేయిస్తాం….. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభాముఖంగా హామీ… మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమావేశంలో సభాముఖంగా ప్రకటన..
……ప్రజాలహరి న్యూస్ వెబ్లో… మార్చి 20వ తేదీన మిర్యాలగూడ కు ఔటర్ రింగ్ రోడ్డు ప్రకటించాలి .. జిల్లా మంత్రులు …. జర చూడండి….అనే వార్తకు నేడు స్పందన…..
మిర్యాలగూడ ప్రజాలహరి..
మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సభ ముఖoగా జిల్లా మంత్రులను పలు విజ్ఞప్తి చేశారు. అందులో ప్రధమంగా మిర్యాలగూడ వాణిజ్య వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మిర్యాలగూడ ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేయాలని జిల్లా మంత్రులను కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలో నిధులు కొరత ఆగిపోయిన లిఫ్ట్ లను త్వరితగతిన పూర్తి చేయడానికి సహకరించాలని సభాముఖంగా కోరారు… ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విజ్ఞప్తులపై మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ తనకు ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్నాయని రహదారుల భవనాలు శాఖ తనపర్దే కాబట్టి మిర్యాలగూడకు ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేపిస్తానని అదేవిధంగా ఆగిపోయిన ఎత్తిపోతల పథకాలను త్వరలో పూర్తి చేయిస్తామని ఉత్తమ కుమార్ రెడ్డి . వెంకటరెడ్డిలుహామీ ఇచ్చారు… పత్రికలు, చానళ్లు వెబ్బులు ప్రజా అవసరాలను గుర్తిస్తే వాటికి ఎప్పుడైనా స్పందన లభిస్తుందంటానికి … ప్రజాలహరి న్యూస్ వెబ్…. లో వచ్చిన వార్త స్పందన రావడం ఒక మంచి ఉదాహరణ…