తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ లకు మతిభ్రమించింది మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి వ్యాఖ్యలు
తండ్రీకొడుకులకు మతిభ్రమించింది…. మంత్రులు కోమటిరెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి వ్యాఖ్యలు… మిర్యాలగూడ ప్రజాలహరి…..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతుందని దాన్ని చూడలేక తండ్రి కొడుకులు కేసీఆర్ ,కేటీఆర్ కు మతిభ్రమించిందని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి లు వ్యాఖ్యానించారు. ఈరోజు మిర్యాలగూడ లో ఎన్ ఎస్ పి క్యాంప్ గ్రౌండ్లో మిర్యాలగూడ నియోజకవర్గం సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు జప్తు చేసి ప్రజలకు పంచి పెడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు భారత రాష్ట్ర సమితి పూర్తిగా మునిగిపోయిన పడవని పేర్కొన్నారు కుటుంబంలో చెల్లెలు కవిత జైలు పోవడంతో తండ్రి కొడుకులకు ఏమి చేయాలో అర్థం కాక మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు పథకాలు గ్యారెంటీల అమలు చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఆగస్టు 15 తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో నిధుల కొరతతో ఆగిపోయిన పలు ఎత్తిపోతల పథకాలను త్వరలో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గానికి అండగా ఉంటానని జాతీయ స్థాయిలో తన కుమారుడు రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని అందుకు కార్యకర్తలు శ్రమించి పనిచేయాలని కోరారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో తనను ఆదరించిన విధంగానే మన రఘువీర్ రెడ్డిని ఆదరించి లక్ష మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కార్యకర్తలను ప్రజలను కోరారు తాను ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా చెప్పారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అదేవిధంగా నల్లగొండ జిల్లా అభివృద్ధి కూడా పాటుపడతానని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డిసిసి అధ్యక్షుడు శంకరనాయక్, స్కైలాబ్ నాయక్, భారతి నాయక్, చిరుమర్రి కృష్ణయ్య, తుమ్మల రాజశేఖర్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి,వేణుగోపాల్ రెడ్డి, పగడాల పెద్ద నాగిరెడ్డి ,పగడాల నాగిరెడ్డి వినోద్, బాలు, ఉపేందర్ రెడ్డి, తమ్ముడ బోయిన అర్జు న్, శేఖర్ రెడ్డి , బెజ్జం సాయి, తదితరులు పాల్గొన్నారు