మిర్యాలగూడ ప్రజాలహరి…..ఈనెల 16వ తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు మిర్యాలగూడలోని ఎస్పీ క్యాంపు గ్రౌండ్లో మిర్యాలగూడ నియోజకవర్గ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం జరుగుతున్నదని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఒక ప్రకటన తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ర తోపాటు డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ హాజరవుతారని ఎమ్మెల్యే ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు మాజీసర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు అందరు హాజరై సమావేశ విజయవంతం చేయాలని కోరారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.