
సూర్యాపేట… 11-04-2024న 12:30 గంటలకు రాజుగారి తోట హోటల్ దాటిన తర్వాత రాయినిగూడెం గ్రామ శివారులో NH నెం. 65 రోడ్డుపైన కారు డ్రైవర్ చింతపల్లి ధనుష్ @ బన్ని S/o లేట్ రాజు, వయస్సు: 20 సంవత్సరాలు, కులం: కమ్మ, R/o కేతేపల్లి గ్రామం నల్గొండ జిల్లా, సూర్యాపేట వైపు నుండి కేతేపల్లి కి వెళ్ళుచు కారును అతివేగంగా మరియు అజాగ్రత్తగా నడిపి రోడ్డు పక్కన గల చెట్టుకు టక్కరి ఇవ్వగా, కారులో ప్రయాణిస్తున్న 1) జటంగి సాయి S/o సౌదయ్య, వయస్సు: 17 సంవత్సరాలు, కులం: యాదవ్, వృత్తి: విద్యార్థి మరియు 2) అంతటి నవీన్ S/o లేట్ సైదులు, వయస్సు: 20 సంవత్సరాలు, కులం: ముదిరాజ్, వృత్తి: విద్యార్థి, ఇద్దరిదీ కేతేపల్లి గ్రామము వారికి తీవ్ర గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందినారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న అబ్బూరి గణేష్, కావటి శివలకు దెబ్బలు తగిలి రక్త గాయాలు అయినవి మిగతావారు మరగోని మహేష్, ఉదయ్, కారు డ్రైవర్ చింతపల్లి ధనుష్ @ బన్ని అక్కడి నుంచి పారిపోయినారు. అబ్బూరి గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్ బాలు నాయక్ ఎస్ఐ సూర్యాపేట రూరల్ గారు కేసు నమోదు పరిచి పరిశోధన చేయనైనది