
మౌలానా అతిక్కుల్ రహమాన్ కు స్కూటీ వాహనం బహుకరుణ
మిర్యాలగూడ , ప్రజాలహరి..
ముస్లిముల పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేస్తు ప్రతి రోజు ఖురాన్ పఠనం చేసిన మౌలానా అతిక్కుల్ రహమాన్ కు యువకులు స్కూటీ బహుకారుణ చేశారు. 1.22 లక్షల విలువ చేసే స్కూటీ వాహనాన్ని రంజాన్ గిఫ్ట్ గా శబ్బేఖదర్ సందర్భంగా శనివారం రాత్రి కౌన్సిలర్ జావీద్ అందజేశారు. 30 రోజుల పాటు దివ్య ఖురాన్ చదివి వినిపించినందుకు ఈ బహుమతి అందించినట్లు చెప్పారు. ఆపదలో, పేదరికంలో ఉన్న పేదలను ఆదుకోవడంలో ముస్లింలు ముందులన్నారు.రంజాన్ ఉపవాస దీక్షలు అదే చెప్పుతుందని తెలిపారు. సంపాదనలో కొంత మొత్తం పేదలకు పంచిపెట్టాలన్నారు. ఇమామ్, మౌజాంలను ఆదుకోవలన్నారు.ఈ ఆనవాయితీ అన్ని మజిద్లలో అమలు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జావీద్ మార్కజ్ పాషా ,ఎండి ఇస్మాయిల్, జానీ,అజహార్ సోహేల్, అసద్, ప్యాయజ్, పండు,సాదిక్, నవాజ్, షఫీ, ఫేహిం, అకీబ్ తదితరులు పాల్గొన్నారు.