సామాజిక చైతన్యంలో కళాకారులది కీలక పాత్ర
_ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి.
మిర్యాలగూడ:
సాంస్కృతిక పునరుజ్జీవనం నుండి మొదలుకొని నేటి సమాజం వరకు అనేక మార్పులకు కలా రంగమే దోహద పడిందని, వంద మాటల కన్నా ఒక పాట ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తు ల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ కళావేదిక ఆధ్వర్యంలో స్థానిక మిర్యాలగూడలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన సినీ స్వరాభిషేకానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ పాటలు ఒక సామాజిక మార్పునకే కాక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పాట పాడడం అనేది ఒక గొప్ప వరంలా కళాకారులు భావించాలని అన్నారు.కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడ బోయిన అర్జున్, పొదిల శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్ జలంధర్ రెడ్డి, మర్రి ఎలియాస్, వెంకన్న గౌడ్, కార్యక్రమ నిర్వహకులు శ్రీనివాస చారి, కందుకూరి సుదర్శన్, సత్యనారాయణ చారి, ఏలే సత్యనారాయణ, సరస్వతి, మౌనిక, విద్యావంతుల వేదిక అంబటి నాగయ్య, సమూహ రైటర్స్ ఫోరం కస్తూరి ప్రభాకర్, కొండల్ రెడ్డి, దాసరి రమణ, వాకర్ అసోసియేషన్ లక్ష్మయ్య, వంగాల సైదాచారి,ట్రాక్ నిర్వాహకులు సత్యపైళ్ల తదితరులు పాల్గొన్నారు