భారత రాజ్యాంగాన్ని మార్చడానికి భాజపా కుట్ర చేస్తుంది రాహుల్ గాంధీ ..నేను జానారెడ్డిని కాదు గుర్తుంచుకో కేసీఆర్ చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
భారత రాజ్యాంగాన్ని మార్చడానికి భాజపా కుట్ర చేస్తుంది రాహుల్ గాంధీ..
నేను జానారెడ్డిని కాదు కేసీఆర్ చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా.. రేవంత్ రెడ్డి
….హైదరాబాద్ ప్రజాలహరి
…..కాంగ్రెస్ జన జాతర విజయవంతమైంది హైదరాబాదులోని తుక్కుగూడను జనజాత సభకు రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పెద్దలతో హాజరయ్యారు ఈ సభకు అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదని ఘాటుగా విమర్శించారు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలాగా చట్టబద్ధత చేస్తామని పేర్కొన్నారు అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని చెప్పారు తెలంగాణలో అమలు చేసిన గ్యారెంటీలను దేశవ్యాప్త అమలు చేస్తామని చెప్పారు . కుటుంబంలో ఒక మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఆర్థిక సంఘం అందిస్తామని చెప్పారు తెలంగాణలో ఇప్పటికి 30000 ఉద్యోగాలు ఇచ్చామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మరో 50 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకు యువతకు సంవత్సరం పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ ప్రైవేటు రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోయే విధంగా ఉద్యోగ జాతర నిర్వహిస్తామని చెప్పారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ టాపింగులు పోలీసు వ్యవస్థను పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఢిల్లీలో మోడీ ఫోన్ టాపింగులు చేస్తున్నారని విమర్శించారు దేశంలో అవినీతి మంత్రులు అందరూ మోడీ వెనుకనే ఉన్నారని పేర్కొన్నారు ఎలక్షన్ కమిషన్ కూడా మోడీ వెనకనే ఉన్నదని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని మార్చడానికి భాజపా కుట్ర చేస్తుందని రాహుల్ గాంధీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర దేశానికి మోడల్గా కావాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగర నున్నదని. పేర్కొన్నారు. కెసిఆర్ ను ఎట్ల తొక్కారు భారతీయ జనతా పార్టీని కూడా అదే విధంగా తొక్కలి ఆయన పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ దేశంలో రాష్ట్రంలో మతాలు వర్ణాల మధ్యన చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చూపించనీ బిజెపి మనకు అవసరం లేదని అన్నారు. నమో మోడీ అంటే నరేంద్ర మోడీ మోసం అని అన్నారు.. కేసీఆర్ ఒక నక్క నక్క బయటకెళ్ళింది ఆయన భాష సరిగ్గా లేదు అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ దొంగలాగా పందులు కుక్కల్లాగా దోచుకున్నారు. కెసిఆర్ నీకు చర్ల జైల్లో చెప్పకూడు తినిపిస్తా హెచ్చరిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు నీవు ఎర్రవీగుతున్నావు నిన్ను బట్టలు ఊడదీసి చల్లపల్లి జైల్లో కూర్చోబెట్టకపోతే నేను రేవంత్ రెడ్డిని కాదు అని హెచ్చరించారు. నేను జానారెడ్డిని కాదు గుర్తుంచుకో రేవంత్ రెడ్డిని అనే విషయాన్ని మరవకు కేసిఆర్.ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.