సాగర్ నీటితో చెరువులు, కుంటలు నింపాళీ
*తాగునీటి సమస్య పరిష్కరించాలని
*ఖాళీ బిoదెల తో నిరసన………మిర్యాలగూడ
సాగర్ నీటితో చెరువులు,కుంటలు నింపి తాగు నీటి సమస్య పరిష్కారించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మిర్యాలగూడ మండలంలోని ఇలాపురం గ్రామంలో సాగర్ ఎడమ కాలువ ద్వారా బిందెలతో నీటిని తెచ్చుకుంటున్న గిరిజన మహిళలతో కలిసి నిరసన తెలిపారు. ఇలాపురం చెరువు ఎండిపోవడంతో చెరువులో కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు పూర్తిగా ఎండిపోయాయని దాని ఫలితంగా సాగు, తాగు నీటి సమస్య తీవ్రంగా నెలకొందన్నారు. ముక్యంగా ప్రస్తుత వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని వాపోయారు. ఐలాపురం గిరిజన ప్రజలు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి సాగర్ మెయిన్ కెనాల్ ద్వారా తాగునీటిని తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ ఎడవకాల్వ ద్వారా పాలేరు రిజర్వాయర్ కు తాగునీటి కోసం నీటిని తీసుకెళ్తున్నారని అదేవిధంగా నల్గొండ జిల్లాలో తాగునీరు సమస్య పరిష్కరించేందుకు సాగర్ మెయిన్ కెనాల్ ద్వారా చుట్టుపక్కల చెరువులు కుంటలు నింపాలన్నారు. ఎడమ కాలువ పరిధిలో ఉన్న లిస్టుల ద్వారా నీటిని చెరువుల కుంటలకు మళ్లించినట్లయితే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. దానివలన తాగునీటి ఎద్దడి నివారించవచ్చని చెప్పారు. భూగర్భ జలాలు పెరగటం వలన ప్రజల, పక్షులు, పశువుల దాహార్తి తీరుతుందని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం అధికారులు స్పందించి సాగర్ నీటితో చెరువులు కుంటలు నింపి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరెపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవి నాయక్, పగిడోజు రామ్మూర్తి, నాగేశ్వర్ నాయక్, శ్రీను నాయక్, వెంకటేశ్వర్లు, జగన్ నాయక్ బాణవత్ నాగమ్మ, సునీత, లక్ష్మీ, ఈరి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.
