బాలాజీ ఆస్పత్రిలో న్యూరో సర్జన్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ పట్టణంలోని బాలాజీ హాస్పిటల్* నందు నూతనంగా ఏర్పాటు చేసిన *న్యూరో సర్జన్ కేర్ సెంటర్ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ న్యూరో సర్జన్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని న్యూరో సమస్యల కోసం హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే వైద్య పరీక్షలు నిర్వహించుకోవచ్చు అని అన్నారు ఈ సందర్భంలో పేదలకు అవసరమైన చికిత్సలు అందిస్తూ కొంతమేరకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో బాలాజీ హాస్పటల్ సిఎండి చిలుకూరి గోపి, హాస్పిటల్ చైర్మన్ పోషం సునీత, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు