జనాదరణ పొందుతున్న *నందిని నాటకోత్సవాలు*-2024
ప్రజాలహరి మిర్యాలగూడ
మిర్యాలగూడ మినీ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ మరియు మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం సంయుక్తంగా నిర్వహించు నందిని నాటకోత్సవాల్లో భాగంగా మూడవరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతిని వెలిగించి నాటకోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ అంతరించిపోతున్న కలలకి జీవం పోస్తున్నట్లు ఈ నాటకోత్సవాలు ఉపయోగపడనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ పద్య మరియు సాంఘిక నాటకాలు యువతలో చైతన్యం నింపే విధంగా ఉండాలన్నారు. రాబోవు తరం వారికి ఈ నాటకాలపై చక్కటి ఆసక్తిని పెంపొందించేలాగా మంచి కథ కథనాలతో జనం మధ్యకు తీసుకురావాలని వాటి ద్వారా వారికి కలల పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా తోడ్పడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
ఉ.10 గంటలకు జేఎంజే నాట్యమండలి విజయవాడ వారిచే *రక్తపాశం* పద్య నాటకం
మ.2:30ని.లకు *నాలోన నీవే* సాంఘిక నాటిక శ్రీ కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ గుంటూరు వారిచే ప్రదర్శింపబడినది
సా.4 గం.లకు *జీవనయానం* సాంఘిక నాటిక జనచైతన్య ఒంగోలు వారిచే
సా.6గం.లకు నవజ్యోతి కళానిలయం జడ్చర్ల మహబూబ్నగర్ జిల్లా వారిచే *మైరావణ* పద్య నాటకం.
నాటికల ప్రదర్శన అనంతరం కళాకారులకు కమిటీ వారిచే ప్రశంసా పత్రాలు పారితోసకం అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు బోయినపల్లి భుజంగరావు ,ప్రధాన కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, కోశాధికారి పుల్లాభట్ల లక్ష్మీనారాయణ శర్మ, గ్యార సాయిలు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పరిమి రామావతారం, ప్రచార కార్యదర్శి మామిడాల ఉపేందర్ , దుర్గి శ్రీనివాస శర్మ, రామలింగాచారి, యడ్ల వెంకటేశ్వర్లు, రాఘవయ్య, శ్రీనివాసరావు మరియు మిర్యాలగూడ సంస్కృత కళా కేంద్రం సభ్యులు పాల్గొన్నారు.