ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
వేములపల్లి ఏప్రిల్ ప్రజాలహరి): రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకుప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందవచ్చని డి ఆర్ డి ఏ పిడి టి.నాగిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఆమనగల్లు గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో 17 శాతం కంటే తక్కువగా తేమ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే సమయంలో రైతులు తమ ఆధార్ కార్డు,బ్యాంక్ పాస్ పుస్తకం, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్లు కాపీలను తమ వెంట తీసుకు వచ్చి కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సమర్పించాలన్నారు. నాణ్యమైన వరి ధాన్యానికి ఏ గ్రేడ్ కు 2,203 రూపాయలు, సాధారణ రకానికి2,183 పొందవచ్చు అన్నారు. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని సీరియల్ ప్రకారం కాంటాలు వేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కె. నాగమణి, ఏపిఎం ఎండి నిజాముద్దీన్, సీసీ రమణయ్య, ఈజీఎస్ ఏపీవో మీ రాజుద్దీన్, కమిటీ సభ్యులుసైదమ్మ,లూర్ధమ్మ, జానమ్మ, శ్రీలత, దివ్య, వివో ఏలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.