గంగమ్మ జాతరను సందర్శించిన ఎమ్మెల్యే
వేములపల్లి (ప్రజాలహరి) వేములపల్లి మండలంలోని మొల్కపట్నం గ్రామంలో గంగమ్మ తల్లి జాతరను సోమవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులు కులదేవత అయిన గంగమ్మ తల్లి జాతరను జరుపుకోవడం ఎంతో ఘన నియమని ఆయన కొనియాడారు. గ్రామంలోని యాదవ సోదర సోదరీమణులు సతి కుటుంబ సమేతంగా వచ్చి తమ కులదేవతను తమ కులదేవతను మొక్కులు తీసి ఆరాధించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ శంకర్ నాయక్, వేములపల్లి ఎంపీపీ సునీత స్థానిక ఎంపీటీసీ పాతూరి గోవర్ధన శశిధర్ రెడ్డి యాదవ సంఘం కుల పెద్ద భారీ నరేష్, ఎల్లబోయిన సైదులు, నగేష్, నామి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పాదూరి కిరణ్ రెడ్డి, భారీ పాండు తదితరులు పాల్గొన్నారు