Ultimate magazine theme for WordPress.

తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో నాలుగు నెలల కాలంలో 200 మంది రైతులు ఆత్మహత్య… కేసీఆర్

Post top
home side top

ప్రజాలహరి ,సూర్యాపేట..

కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల పాలన కాలంలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారి గురించి పట్టించుకోని పరిస్థితి రాష్ట్రంలో లేదని ఎంతసేపు,పార్టీ ఫిరాయింపులు పై దృష్టి పెట్టడమే తప్ప రైతన్న పట్టించుకోవాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అన్నారు.. ఆయన జనగాం, తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. నీటి కరువుతో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు వాటి నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంలో పంటలు ఎండిపోవడంతో తన కుమార్తె వివాహము ఆగిపోయిందని ఒక రైతు బోరున వేడవడంతో కేసీఆర్ వెంటనే స్పందించి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం సూర్యపేటలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపనాలతో మాటలతో కాలయాపన చేస్తుందని విమర్శించారు కర్చపూర్తమైన విధానాలను అవలంబిస్తూ ప్రతిపక్షాలము లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. తమ పదేళ్ల పాలనలో ఈనాడు రైతు అవస్థ పడలేదని పేర్కొన్నారు గిట్టుబాటు ధర రావడంలేదని రైతు భరోసా రుణమాఫీలు ఇంతవరకు అమలులోసుకోలేదని పేర్కొన్నారు ఈనాడు నీటికి కటకటలాడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు రైతుల పక్షాన తాను ఎల్లప్పుడూ పోరాడుతానని ప్రభుత్వాన్ని ఎండబెట్టడమే తమ పని విమర్శించారు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చూసేది లేదని వారిని తరిమి కొడతామని పేర్కొన్నారు.. తమ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లిందని పేర్కొన్నారు కాంగ్రెస్ బిజెపి తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులను ఎంపీలను పార్టీలో చేరుకోవడమే చేర్చుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఘాటుగా విమర్శించారు ఈ విధానం ఎప్పటికీ కాదని చెప్పారు. ముఖ్యమంత్రి వెంట మాజీ ముఖ్యమంత్రి వెంట జనగాం ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డిఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఎంపీ బడుగు లింగయ్య, నల్గొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భాస్కరరావు భూపాల్ రెడ్డి, విజయ్ సింహ రెడ్డి ,చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.