‘శివలీల’ దాతృత్వం మహోన్నతం
* ప్రముఖుల మన్ననలు పొందుతున్న ఆమె సేవా కార్యక్రమాలు
* న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవలు విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన
* ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్ల పంపిణీ అభినందనీయం :
మిర్యాలగూడ ప్రజాలహరి..
నల్లగొండ జిల్లాలో కనగల్లు మండలంలోని కనగల్లు గ్రామానికి చెందిన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషియనర్ (ఆర్ఎంపీ),న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శివలీల దాతృత్వం మహోన్నతమైనదని ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ అభివర్ణించారు. ఆమె నిర్వర్తిస్తున్న అనేక సేవా కార్యక్రమాలు ప్రముఖుల మన్ననలను పొందుతున్నాయని అన్నారు. న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవలు విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేయనున్నట్టు తెలిపారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పలు ముస్లిం కుటుంబాలకు కంబాల శివలీల రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హమీద్ షేక్ మాట్లాడారు. సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం ఈసీ మెంబర్ గా వ్యహరిస్తున్న కంబాల శివలీల…కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో అనేక కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రక్తదానం శిబిరాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. నల్లగొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, పెన్నులు పంపిణీ చేశారు. ఆమె సేవా కార్యక్రమాలను గుర్తించిన పలు సంస్థలు ఆమెను అబ్దుల్ కలాం, సర్ధార్ వల్లభభాయ్ పటేల్, పుడమి రత్న, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సామాజిక సేవా రత్న,
మదర్ థెరిస్సా అవార్డు గ్రహీత, ఉత్తమ మహిళ, ఆదర్శ మహిళా, స్త్రీ శక్తి, సరోజినీ నాయుడు, సావిత్రి బాయ్ ఫూలే వంటి పురస్కారాలతో సత్కరించాయని అన్నారు. కంబాల శివలీలను మహిళామణులు ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. తన సేవా కార్యక్రమాలను దాసోజు కృష్ణమాచారి- ఆర్ఎంపీ, బడుగుల శ్రీనివాస్- ఆర్ఎంపీ, సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు బండమీది అంజయ్య, భిక్షాల మహేష్ – ఆర్ఎంపీ, సామాజికవేత్త చింతరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు సహకరిస్తున్నట్టు తెలిపారు. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరసోదరీమణులంతా భక్తి,శ్రద్ధలతో ఉపవాసదీక్షలను చేపట్టాలని హమీద్ షేక్ కోరారు. ఈ కార్యక్రమంలో బాబా, సాజిద్, తదితరులు పాల్గొన్నారు………….. జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్. కీట్ల పంపిణీ *
ఈ కార్యక్రమానికి.ఆర్దిక సహాయం చేసిన. *ప్రముఖ దంత వైద్య నిపుణులు నాగు నాయక్ ,దైద కిరణ్, డాక్టర్ బాలాజీ నాయక్ అను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు. సోమ శ్రీనివాస్ , శోభా రాణి , రజిత . స్వాతి ట్రావెల్స్ దయాకర్ రెడ్డి , హఫీజుద్దిన్ డాక్టర్ వికాస్ కుమార్ , వెంకన్న , సఫీన్యూసా బేగం సహకారాలు అందించారు ఈ కార్యక్రమంలో జనయేత్రీ వ్యవస్థాపక అధ్యక్షులు మునీర్ అహ్మద్ షరీఫ్ జనయేత్రి జిల్లా ప్రధాన కార్యదర్శి తాజ్ బాబా మరియు జరీనా మేడం గారు.*…. …..*సహాయ సహకారాలతో 60 మంది నిరుపేద కుటుంబాలకి రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది.* ఈ కార్యక్రమం గురించి జనయేత్రీ వ్యవస్థాపక అధ్యక్షులు మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తన చుట్టూ ఉన్న నిరుపేదలకు ఆర్థిక హార్దిక సహాయ సహకారాలు అందించాలని మేము చేసే ఈ కార్యక్రమం తో స్ఫూర్తిగా తీసుకొని ఇంకొంతమంది దాతలు ముందుకు వచ్చి తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం గురించి *తాజ్ బాబా మాట్లాడుతూ.* జనయేత్రి ఫౌండేషన్ లో జనం కోసమే జనయేత్రీ జనంతోనే జనయేత్రీ.అనే నినాదంతో జనయేత్రి ఫౌండేషన్ రెండు తెలుగు ఉభయ రాష్ట్రాలలో.కుల మతాలకు అతీతంగా సేవలు చేస్తున్న జనయేత్రి సైనికులకి పేరుపేరునా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమం గురించి వాట్సప్లో ఒక్క మెసేజ్ పెట్టగానే స్పందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా జనయేత్రి ఫౌండేషన్ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో *జరిన మేడం మాట్లాడుతూ* ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మన చుట్టూ ఉన్నవారికి నిరుపేదలకు ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుందని తెలియజేశారు *ఈ కార్యక్రమంలో పోగుల సందీప్ , షాహిర్ , అఖిల్ , చరణ్ తదితరులు పాల్గొన్నారు*