*వాహనాల తనిఖీలో ఒక వ్యక్తి నుండి 1,55,000 రూపాయల నగదు ను పట్టుకున్న టూటౌన్ పోలీసులు.*
ప్రజాలహరి క్రైమ్ మిర్యాలగూడ
ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో హనుమాన్ పేట ఫ్లైఓవర్ వద్ద మిర్యాలగూడ టూ టౌన్ సీఐ గారి ఆధ్వర్యంలో ఎస్.ఐ కృష్ణయ్య మరియు సిబ్బంది లు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాహనాల తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి Rs. 1,55,000/- నగదు ను రవాణా చేస్తు పట్టుబడినాడు, ఆధారాలు అడుగగా ఎటువంటి ఆధారాలు చూపందున అట్టి నగదును సీజ్ చేసి జిల్లా ట్రెజరీ ఆఫీస్ కి పంపామని మిర్యాలగూడ టూ టౌన్. సిఐ పి నాగార్జున తెలిపారు.