Ultimate magazine theme for WordPress.

రచ్చ వెంకటేశ్వర్లు గారు విద్యార్థులతో మమేకమైన తీరు ఉపాధ్యాయ లోకానికి ఆదర్శం దుగ్గిరాజు ఫణి కుమార్

Post top

చిల్లాపురం ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటీ గా పని చేస్తున్న రచ్చ వెంకటేశ్వర్లు పదవీ విరమణ కార్యక్రమం చిల్లాపురం పాఠశాలలో ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థుల, గ్రామ ప్రజల మధ్య ఘనంగా జరిగింది. పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు దుగ్గిరాజు ఫణి కుమార్  మాట్లాడుతూ వెంకటేశ్వర్లు గారి సేవలు ప్రశంసనీయమని విద్యార్థులతో మామేకమైతో వారి కి విద్యా బోధనలు చేసి గ్రామంలో మండల స్థాయిలో మంచి ఉపాధ్యాయుడుగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు .మిర్యాలగూడ మండల విద్యాధికారి బాలాజీ నాయక్ మాట్లాడుతూ రచ్చ వెంకటేశ్వర్లు ఉపాధ్యాయ లోకానికి ఆదర్శం అని అన్నారు. సెలవులు కూడా పెట్టుకోకుండా బడికి హాజరవుతూ నిరంతరం విద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచన చేసే గొప్ప ఉపాధ్యాయుడు రచ్చ వెంకటేశ్వర్లు అని కొనియాడారు. అనంతరం జిల్లా పిఆర్టియు నాయకులు ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన వ్యక్తి రచ్చ వెంకటేశ్వర్లు అని భవిష్యత్ లో కూడా విద్యా సేవలను అందించాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రచ్చ వారి సేవలు అమూల్యమైనవి అని, పాఠశాలలో నిబద్దత తో పనిచేసిన గొప్ప ఉపాధ్యాయుడు అని అన్నారు. వృత్తికి అంకితం, ఎన్నడూ సెలవులు కూడా పెట్టుకోకుండా పాఠశాల అభివృద్ధి కి తోడ్పాటు అందించిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. అనంతరం మరి తోటి ఉపాధ్యాయుడు రెబ్బ రాంబాబు మాట్లాడుతూ అన్నగారితో సుదీర్ఘ కాలం కలిసి ప్రయాణం చేసే అదృష్టం తనకు దక్కిందని అన్నారు. నీతికి, నిజాయితీకి కట్టుబడే వ్యక్తి అని, వృత్తి పట్ల అపరిమితమైన ప్రేమను కురిపించే గొప్ప ఉపాధ్యాయుడు అని అభిప్రాయపడ్డారు. అనంతరం ప్రముఖ కార్టూనిస్ట్, బాలకథా రచయిత, ఉపాధ్యాయుడు వడ్డేపల్లి వెంకటేష్ రచ్చ వెంకటేశ్వర్లు సన్మాన పత్రాన్ని చదివి వినిపించారు. అనంతరం రాపోలు పరమేష్ రచ్చ వారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. చిల్లాపురం పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాల చిన్నారుల కళా ప్రదర్శన ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. ఈ కార్యక్రమంలో పిి ఆర్ టి య ప్రధాన కార్యదర్శి  కాలం నారాయణరెడ్డి, మండల అధ్యక్ష కార్యదర్శులు సైదులు యుగేందర్ రెడ్డి, పత్రికా సంపాదకులు నరసింహ నాయక్, రిటైర్డ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిహెచ్ఎం లక్ష్మణ్ నాయక్, గోపీనాయక్, మిర్యాలగూడ డివిజన్ స్థాయిలోని మండల అధ్యక్ష కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.