
మిర్యాలగూడ ప్రజాలహరి….మిర్యాలగూడ బిజెపికి మంచి రోజులు వచ్చాయి .నూతన యువ రక్తం రామబాణాలై దూసుకొస్తున్నాయి. మిర్యాలగూడ లో ఒకప్పుడు ఐదుగురు కౌన్సిలర్లు ఉన్నారు. ఎంపీ ,ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేసేది పరిస్థితి ఉండే. గత పది -పదిహేను సంవత్సరాల కాలంలో బిజెపి జవసత్తాలు కోల్పోయింది. వార్డు కౌన్సిలర్ ల సంఖ్య ఒకటి రెండు సీట్లకు పరిమితం అయిపోయింది. పార్లమెంటులో పోటీకి ఆసక్తి లేని పరిస్థితి ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితి లేకపోవడం నామమాత్ర పోటీతో పార్టీ బలహీన పడిపోయింది.. ఇటువంటి సందర్భంలో పక్క భారత జాతీయ భావజాలాలు కలిగిన విద్యావేత్త తుమ్మలపల్లి హనుమంత రెడ్డి మిర్యాలగూడ పట్టణ బిజెపి అధ్యక్షుడు కావడం ఒక విధంగా బిజెపికి మంచి రోజులు వచ్చాయని చెప్పడానికి ఉదాహరణ.. రెడ్డి వర్గానికి చెందిన నాయకుడు మరియు ఉత్సాహవంతుడు, అందరిని, పార్టీని కలుపుకుని పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి .యువనాయకత్వం రావట వలన రానున్న పార్లమెంటు ఎలక్షన్స్ లో బిజెపికి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇప్పటికైనా పాత తరం కొత్త తరం నాయకులు కలిసికట్టుగా యువనాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆయన ఎన్నిక పట్ల మిర్యాలగూడ నియోజకవర్గం బిజెపి నాయకులు సాధనేని శ్రీనివాసరావు, గూడూరు శ్రీనివాసరావు, పురుషోత్తం రెడ్డి దొండపాటి వెంకటరెడ్డి, బంటు సైదులు, మదన్ మోహన్ , కె ఎల్ ఎన్ కాలేజీ అధ్యాపక బృందం నరేందర్ రెడ్డి, కిరణ్ కుమార్లు హర్షం వ్యక్తం చేశారు