మిర్యాలగూడ ప్రజాలహరి…
మిర్యాలగూడ పట్టణంలోని *కళా భారతి* నందు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బాషా సాంస్కృతిక శాఖ మరియు మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం సంయుక్త నిర్వహణలో జాతీయ స్థాయి పద్య నాటక, సాంఘిక నాటికల పోటీలు ప్రారంభం అయ్యాయి . ముఖ్యఅతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు .. ఈ కార్యక్రమంలో కళాపరిషత్ అధ్యక్ష కార్యదర్శులు భుజంగరావు, పులి కృష్ణమూర్తి పుల్లాభట్ల లక్ష్మీనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.. స్థానికంగా నూతనంగా నిర్మించబడిన కళాభారతి క్షేత్రంలో ఈరోజు నాటక పోటీలు ప్రధమంగా ప్రారంభమయ్యాయి… జాతీయస్థాయిలో నాటిక పోటీలకు వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన వాటిని ప్రదర్శించడం జరిగింది. ప్రదర్శనల అనంతరం కళాకారులకు బహుమతులు అందజేశారు…