మట్టపల్లి ప్రజాలహరి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సన్నాయిక సమావేశం మట్టపల్లిలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత గా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి, మాజీ MP & నీటిపారుదల & పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. 10,000 మందికి పైగా కార్యకర్తలు హాజరైన ఈ సమావేశం లో AICC ఇంచార్జి శ్రీమతి దీపా దాస్ మున్షి , R&B శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు & కాంగ్రెస్ MP అభ్యర్థి రఘువీర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో కాంగ్రెస్ 13-14 MP సీట్లు గెలుచుకుంటుందని కెప్టెన్ ఉత్తమ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పట్ల వారి చిరకాల అంకితభావం, నిబద్ధత, చిత్తశుద్ధి, త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయని కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.