*వేములపల్లి ఎస్ఐ డి.విజయ్ కుమార్ కు ఘనంగా సన్మానం*
*-చైర్మన్ తాళ్ల.వెంకటేశ్వర్లు*
వేములపల్లి,మార్చి 29(ప్రజాల హరి): మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలోని శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయ జాతర మహోత్సవాలు ఈనెల 23 నుండి 26 వరకు జరిగిన జాతర కు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. చివరి రోజు రాత్రి సాంస్కృతిక కార్యకలాపాలను ఎన్నడూ లేని విధంగా జబర్దస్త్ బృందంతో కల్చరల్ ప్రోగ్రామ్ నిర్వహించారు. నాలుగు రోజులు జరిగిన జాతర ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఆటంకం జరగకుండా భారీ బందోబస్తు తో జాతరను విజయవంతానికి కృషి చేసిన వేములపల్లి మండల ఎస్సై డి.విజయ్ కుమార్ ను అమనగల్లు శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఘనంగా శాలువాతో సన్మానం సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సింగ్, హోంగార్డ్ లక్ష్మీనారాయణ,స్టేషన్ సిబ్బంది, మండల యువ నాయకులు సందీప్ నాయుడు, పత్తిపాటి.వినయ్, అవిరెండు సతీష్, పెరుమళ్ళ.జోజి, వాకిటి ఎల్లయ్య, లింగారెడ్డి, గంట కృష్ణయ్య, పెరపాక సతీష్, గంగయ్య,శంకర్ తదితరులు పాల్గొన్నారు.