*ఆమనగల్లు గ్రామంలో గంజాయి సేవించి అల్లరి మూకల ఆగడాలు*
*మహిళల పట్ల అసభ్య ప్రవర్తన*
*ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై కత్తులతో, రాళ్లతో దాడి*
*పోలీసులను ఆశ్రయించిన బాధితులు… కేసు నమోదు*
వేములపల్లి. ప్రజాలహరి: గంజాయి సేవించి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై కత్తులతో, రాళ్లతో, కర్రలతో దాడి చేశారని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వేములపల్లి మండలంలో చోటుచేసుకుంది… స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారంగా నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో ఎంతో చరిత్ర గల శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర వేడుకలు మూడు రోజులు ఎంతో ఘనంగా జరిగాయి అయితే ఈ నెల 27 బుధవారం రోజు సుమారుగా సాయంత్రం ఐదు గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి జాతర వద్దకు వెళ్లిన క్రమంలో గ్రామానికి చెందిన కొంత మంది అల్లరి మూకలు గంజాయి సేవించి
రెండు ఫ్యామిలీల పై దౌర్జన్యానికి దిగారు ఆడవారు అని చూడకుండ చిన్నపిల్లపై అమానుషంగా మానవత్వము లేకుండా ఈవిటిజింగ్ చర్యలు చేశారు. బైకులపై రాష్ గా డ్రైవ్ చేస్తూ మహిళల, యువతులకు డాష్ ఇస్తూ వారి పట్ల ఆసభ్యంగా ప్రవర్తించగా కుటుంబ సభ్యులు వారిని మందలించారు. దీంతో వారిపై ఇష్టం వచ్చిన రీతిలో దుర్భాషలాడుతూ ఎక్కువ మాట్లాడకు మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం నువ్వు ఎవడ్రా అంటూ మహిళలపై చేతులు వేస్తూ కుటుంబ సభ్యులపై కర్రలతో, రాళ్లతో, కత్తులతో దాడికి దిగి గాయాలు అయ్యే విధంగా దాడి చేసి వారి వెంట ఎక్కడికి పోతే అక్కడికి వెళ్లి మిమ్మల్ని చంపేస్తాం ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకో పో అంటూ బెదిరిస్తూ రని తెలిపారు.. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న కుటుంబ సభ్యులు 100కు సమాచారం ఇచ్చి మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు.. ఈ ఫిర్యాదు పై వెంటనే స్పందించిన మండల ఎస్ఐ డి విజయ్ కుమార్ కొంత మంది పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అల్లరి మూకలు గ్రామాలలో మాధక ద్రవ్యాలు సేవించి గ్రామ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలో మరల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు….