ప్రజాలహరి క్రైమ్ మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణ పరిధిలో పలు ప్రాంతాల్లో నిర్ణీత వేళల్లో విద్యుత్ కోతలు ఉంటాయని విద్యుత్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు మిర్యాలగూడ సబ్ డివిజన్ ఏడిఈ కోడి రెక్క రవికుమార్,ఎఈలు టౌన్ వన్, టౌన్ టు. వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 27.03. 2004 బుధవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మిర్యాలగూడ టౌన్ -2 పరిధిలోని 11 కెవి హనుమాన్ పేట ఫీడరు లో గల చెట్లు తొలగించుటకు ఎల్ సి తీసుకోబడును
దీనివలన హనుమాన్ పేట, రెడ్డి కాలనీ, నాగార్జున నగర్, ముత్తిరెడ్డి కుంట ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిరుపివేయబడుననీ తెలిపారు
అలాగే టౌన్ -వన్ పరిధిలో గల 11 కెవి గాంధీ నగర్, 11 కెవి ఈదులగూడెం ఫీడర్ లలో గల చెట్లు తొలగించుటకు ఉదయము 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. దీనివలన షాబునగర్, గాంధీనగర్ ప్రాంతాలలో మరియు హౌసింగ్ బోర్డు, ఈదులగూడెం ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదు. కనుక వినియోగదారులు సహకరించగలరని పత్రికా ద్వారా ప్రజలను కోరారు.