Ultimate magazine theme for WordPress.

సల్కునూరులో ఘనంగాశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం

Post top

ఘనంగా లక్ష్మీనరసింహస్వామి జాతర

వేములపల్లి (ప్రజాలహరి) వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి జాతరను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరను ప్రజలు పార్టీలకతీతంగా చిన్న పిల్లలతో సహా పాల్గొని డబ్బులు వాయిద్యాల మధ్యన ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి జాతరను ఉద్దేశి ంచి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి , మాట్లాడుతూ వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి జాతర క్రమం తప్పకుండా ప్రజలు ప్రత్యేక హోలీ తథానంతరం తెల్లారి ఇట్టి జాతరను నిర్వహించి దేవుని కల్యాణం జరుపుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా గ్రామంలోని ప్రజలు దేవుని కల్యాణంలో కళ్యాణంలో పాల్గొని అందరూ ఆయురారోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలతో ఉండి, రాష్ట్రంలో సరైన సమయంలో వర్షాలు కురిసి రైతన్నలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన దేవుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చాడ శ్రీనివాసరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవతు శంకర్ నాయక్ ,గ్రామ మాజీ సర్పంచ్ తమ్మడ బోయిన రామన్న, అంకపాక రాజు, ఎంపీటీసీ గడ్డం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.