Ultimate magazine theme for WordPress.

కృష్ణారెడ్డి గెలుపుకు పని చేస్తాం మాజీ ఎమ్మెల్యే భాస్కర

left home Post top

నల్లగొండ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కృష్ణా రెడ్డిని కలిసిన భాస్కర్ రావు

ప్రజాలహరి మిర్యాలగూడ

నల్లగొండ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డిని హైదరాబాద్ లోని నివాసంలో మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. నల్లగొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణా రెడ్డిని ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ కు ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా కంచర్ల కృష్ణా రెడ్డికి భాస్కర్ రావు పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. భాస్కర్ రావు వెంట నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కోదాడ మాజీ శాసనసభ్యులు బోల్లం మల్లయ్య యాదవ్, తదితరులు ఉన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.