Ultimate magazine theme for WordPress.

విష జ్వరాలతో అవస్థలు పడుతున్న ప్రజలు పట్టించుకోని ఆరోగ్యశాఖ

left home Post top

ఊరంతా విష జ్వరాల ఇంటికి ఒకరు మంచం మీదనే

అడ్రస్ లేని ఆరోగ్యశాఖ

వేములపల్లి (ప్రజాలహరి) ప్రభుత్వం లక్షలాది రూపాయలు వేయంతో ప్రతి గ్రామంలోని ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలని గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ లను ఏర్పాటు చేయడం జరిగింది . అంతేకాకుండా ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తుంటే, అట్టు ప్రభుత్వ లక్ష్యాన్ని ఆరోగ్య శాఖ అధికారులు తుంగలో తొక్కి తమ ఇష్టారాజ్యంలో వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో, వివిధ రకాల జ్వరాలతో ప్రజలు పలు రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే, వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ ఆరోగ్యశాఖ సిబ్బంది మాత్రం, ఆడుతూ, పాడుతూ ప్రజల ఆరోగ్య సమస్యలు పట్టకుండా తమ ఇష్టం వచ్చిన రీతిలో చుట్టూ చూపులా వచ్చి పోతున్నారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బంది మాత్రం ఇలా వచ్చి, అలా పోతున్నారు. గ్రామాల్లో నుంచి ప్రజలు తమ కార్యాలయానికి రావడంతో అలా పేరు రాసుకొని ఇలా ఒక మాత్రలు ఇచ్చి నిలబడుతున్నారు. దీంతో ప్రజలు దిక్కు తోచని స్థితిలో ప్రాణాల కంటే ఎక్కువ అన్నట్టుగా మిర్యాలగూడ పట్టణ ప్రాంతాలకు వెళ్లి వివిధ రకాల పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వసతులు లేవని సంబంధిత సిబ్బంది, విష జ్వరాలతో వచ్చిన పేద ప్రజల జీవితాలతో చెలగాటాలు ఆడుతున్నారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేరుకు మాత్రమే 24 గంటలుగా పనిచేస్తున్నటువంటి కార్యాలయం గా బోర్డులు మాత్రం పెడతారు. ఇట్టి ఆరోగ్య కేంద్రంలో జరాలతో వచ్చినటువంటి ప్రజలకు ఒక మూత్ర పరీక్ష ఉండదు, ఒక రక్త పరీక్ష ఉండదు దీంతో ప్రజలు సంబంధిత సిబ్బందిని పరీక్షలు చేయాలని అడగగా ఇక్కడ ఎలాంటి పరికరాలు అందుబాటులో లేవని పట్టణ ప్రాంతాలకు వెళ్లి చూయించుకోవాల్సిందిగా, సంబంధిత ఆరోగ్యశాఖ అధికారులు సిఫారసు చేస్తారు. దీంతో వేములపల్లి మండల ప్రజలు మిర్యాలగూడ పరిసర ప్రాంతాలకు వెళ్లాలంటే నానా తంతాలు పడుతూ, డబ్బు లేని నిరుపేదలు ఇక్కడ ఇచ్చేటటువంటి మాత్రలతో సరిపెట్టుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సరైన సమయంలో, వచ్చి పేద ప్రజలకు కావలసినటువంటి వైద్య సౌకర్యాన్ని కల్పించాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇట్టి విషయాన్ని తక్షణమే జిల్లా వైద్య అధికారులు చొరవ తీసుకొని పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా చూడాలని గ్రామాల్లోని ప్రజలు పలువురు ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.