ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సకాలంలో విధులు నిర్వహిస్తూ, ప్రైవేటు దీటుగా పని చేయాలి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి…మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీలు చేశారు..ఉదయం రావాల్సిన డాక్టర్స్ సమయానికి ఆసుపత్రిలో లేకపోవడంతో అధికారులకు ఫోన్ చేసి హెచ్చరించారు … అలాగే హాస్పిటల్ పరిసరాలు, పేషంట్స్ ఉంచే వార్డ్స్ అన్ని పరిశుభ్రంగా ఉంచాలని వారిని ఆదేశించారు … కార్పొరేట్ హాస్పిటల్ కి దీటుగా మన ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలని మేము ఆదేశాలు ఇస్తుంటే మీరు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని హాస్పిటల్ సిబ్బందిపై మండిపడ్డారు … స్థానికంగా ఉన్న గ్రామస్థులు, పేషెంట్స్ తో మాట్లాడారు.