కెసిఆర్ పాపాల కారణంగానే రాష్ట్రంలో కరువు ఏర్పడింది.. కరువు నుంచి కాపాడు శ్రీసీతారామచంద్రస్వామి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి…. మిర్యాలగూడ గూడూరు లో నూతనంగా నిర్మించిన శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం, వెంకటాద్రిపాలెంలో నిర్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయాలు ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి లు పాల్గొన్నారు . ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ చేసిన పాపాల వల్లనే రాష్ట్రంలో కరువు ఏర్పడిందని సీతారామచంద్రస్వామి వీరబ్రహ్మేంద్రస్వామిలు మీయొక్క అనుగ్రహంతో మరల తెలంగాణలో వర్షాలు అధికంగా పడి పంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలనీ దీవించాలని మంత్రి కోరారు. కొన్ని మిల్లులు రైతులు పండించిన పంటకు సరైన ధర చెల్లించటం లేదని ఆ మిల్లులను సీజ్ చేయాలని ఒకవేళ మిల్లులు ఇప్పటికైనా దారిలో రాకపోతే రాష్ట్ర ప్రభుత్వ ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు.