
*యాద్గార్ పల్లి గ్రామంలో ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం లో టి.బి(క్షయ) వ్యాధి పై అవగాహన ర్యాలీ*
ప్రజాలహరి ……
కె యన్ యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ప్రిన్సిపాల్ మరియు చైర్మన్ డా.బిక్షమయ్య అధ్యక్షతన ప్రత్యేక శిబిరంలో భాగంగా యాద్గార్ పల్లి గ్రామంలో డిస్ట్రిక్ట్ టి.బి(క్షయ) వ్యాధి నివారణ కేంద్రం మరియు యన్ యస్ యస్ ప్రత్యేక శిభిరం యన్ యస్ యస్ వాలంటీర్స్ అధ్వర్యంలో టి.బి(క్షయ) వ్యాధి పై ర్యాలీ నిర్వహించి స్లొగన్స్ ఇస్తూ అవగాహన కలిపించారు.టీబి డిస్టిక్ సూపర్ వైజర్, కే వెంకట్ రెడ్డి మాట్లాడుతూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2030 వరకు టీబి ని అంతం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే భారతదేశం అంతకు ఐదు సంవత్సరాలు ముందుగానే 2025 వరకు భారతదేశంలో టీబిని అంతం చేయాలని పిలుపును ఇవ్వడం జరిగింది.టీబి రహిత గ్రామపంచాయతీలుగా 2025 వరకు మార్చడమే భారత దేశ లక్ష్యం అని అన్నారు.డిస్ట్రిక్ట్ సూపర్ వైజర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సరైన పద్ధతిలో పూర్తి కాలం చికిత్సతో ఆరు నెలల లోపు తగ్గుతుంది . టిబి మాత్రలు వాడటం వలన టిబిని నియంత్రణలో ఉంచవచ్చు. నిశ్చయ పోషణ యోజన కింద కేంద్ర ప్రభుత్వం అందించే 500 రూపాయలు చికిత్స కాలం పాటు జమ చేయడం జరుగుతుందని అన్నారు
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్.కోటయ్య, ఐ క్యూ ఏ సి కో ఆర్డినేటర్ ఈ రామ్ రెడ్డి, డాక్టర్ జి నరేష్ ZPHS ప్రధానోపాధ్యాయులు బాలు నాయక్, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు. యమ్ వెంకటేశ్వర్లు,మిర్యాలగూడ టిబి సూపర్ వైజర్ ఎస్ నాగిరెడ్డి, డి ఆర్ టీబి డిస్టిక్ సూపర్ వైజర్, కే వెంకట్ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకయ్య, డిస్ట్రిక్ట్ సూపర్ వైజర్ శ్రీనివాస్, సీనియర్ టిబి ల్యాబ్ సూపర్ వైజర్ కిషోర్, టీబి హెల్త్ విజిటర్ కవిత, ఆలగడప ప్రైమరీ హెల్త్ సెంటర్ సూపర్ వైజర్ మంగమ్మ, ఏఎన్ఎం ఎలిజెబెత్ , ఆశా వర్కర్స్ లక్ష్మి శశికళ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు