నల్లగొండ జిల్లా: ప్రజాలహరి
మిర్యాలగూడ మండలం
యాద్గర్ పల్లి, గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి , సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కరరావు, కంచర్ల భూపాల్ రెడ్డి , విజయసింహ రెడ్డి, మాజీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడుశ్రీనివాస్ రెడ్డి, కంచర్ల కృష్ణా రెడ్డిలు పరిశీలించారు.
.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి…
.
1.వందరోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో వసూళ్లు, దందాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు… 2.సీఎం స్థాయి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడుతూ ఢిల్లీకి మూటలు పంపుతున్నారు .
3.నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద రెండు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఏడుస్తుంటే ఏ ఒక్క మంత్రికి ఎమ్మెల్యేలకు సోయలేదు .
4..రెండు తడులు నీళ్ళు అందిస్తే పంటలు గట్టెక్కేవి ,కానీ జిల్లా మంత్రులకు సోయులేదు .
5.రైస్ మిల్లర్లను ,క్రషర్ ఓనర్లను బెదిరిస్తూ వసూలు చేశారు జిల్లా మంత్రులు .
6..ఇసుక దందాలో తలమునకులయ్యారు .
7..మిల్లర్లతో మంత్రులు కుమ్మక్కు కావడంతో రైతులకు తక్కువ ధరలు చెల్లిస్తూ మిల్లర్లు దోపిడీ మొదలుపెట్టారు.
8.ఇంతవరకు ప్రభుత్వపరంగా ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదు
9..కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైంది?
10..ఇప్పటికైనా కళ్ళు తెరిచి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
11. మిల్లర్లతో మాట్లాడి రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి .
12.లేదంటే మంత్రులను గ్రామాల్లోకి రానివ్వం .
13..100 రోజుల పాలనలో రాజకీయాలు వసూళ్లు దందాలు తప్ప కాంగ్రెస్ నేతలు ఓరగబెట్టిందేమీ లేదనీ పేర్కొన్నారు..
..