మిర్యాలగూడ కు ఔటర్ రింగ్ రోడ్డు ప్రకటించాలి.. జిల్లా మంత్రులు జర చూడండి…
ప్రజాలహరి ,మిర్యాలగూడ… మిర్యాలగూడకు శాపం కొనసాగుతూనే ఉన్నది. మిర్యాలగూడ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అన్ని దోషాలే ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు గాని జిల్లా మంత్రి వర్గాల్లో ప్రాతినిత్యం ఉండదు… ఆ శాపాలే మిర్యాలగూడ అభివృద్ధికి ఆటంకాలుగా మారుతుంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద రైస్ ఇండస్ట్రీ ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధిలో మాత్రం వెనుకబాటే. గ్రామ పంచాయతీ నుంచి గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయినప్పటికీ నిధుల కొరత అభివృద్ధి దూరం.. ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఏనాడు మంత్రివర్గంలో ఉండరు. మిర్యాలగూడ పార్లమెంట్ గా ఉన్న సమయంలో మాత్రమే ఎంపీ సూదిని జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన సమయంలోనే చెప్పుకోదగ్గ నిధులు మిర్యాలగూడకు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మంచి విజన్ ఉన్న నేత. ఆయనకు కు మంచి మంచి సూచనలు, సలహాలు చేస్తూ మిర్యాలగూడ అని అగ్రగామిగా నిలబెట్టాల్సిన బాధ్యత పలువురుపై ఉన్నది. మిర్యాలగూడ అభివృద్ధి చిత్రం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 20 – ఏళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, భాస్కర్ రావు హయంలో మంజూరైన రవీంద్రభారతి ,గ్రంథాలయం పార్కు ,బైపాస్ రోడ్డు మినీ ట్యాంక్ బండ్ ఆ పనులు నే టికి ఇంకా కొనసాగుతుంది. మిర్యాలగూడ జిల్లా ఆస్పత్రి చేయాలని పోరాడిన భాస్కర్ రావు ఆయన కృషి వల్ల ఆసుపత్రి వృద్ధి చెందింది. కిడ్నీ రోగులకు వైద్యం అందుబాటులో కి వచ్చింది. భాస్కర్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బీసీ భవన్, గిరిజన భవన్ లు నిర్మాణం జరిగాయి. ఇవన్నీ ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే జిల్లా మంత్రులుగా గతంలో ప్రస్తుతం పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ప్రత్యేకంగా మిర్యాలగూడ నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి పనులు కేటాయింపు జరగలేదు. మిర్యాలగూడ విస్తరణ నల్లమూలల చెంది పట్టణంలో రహదారులను విస్తరించాలన్న రాజకీయ నేపథ్యం కొనసాగుతుంది. ఈ సందర్భంలో మిర్యాలగూడ అభివృద్ధి వైపు తీసుకు వెళ్లాలంటే ప్రత్యేకంగా ఔటర్ రింగ్ రోడ్డు అవసరం దానివల్లనే మిర్యాలగూడ నాలుగు దిశల అభివృద్ధి చేయవచ్చు. రైల్వే స్టేషన్ ఆవలి నుంచి చింతపల్లి మీదుగా గూడూరు మీదుగా అవంతిపురం ,యాదగిరి పల్లి మీదుగా శెట్టిపాలెం మీదుగా రైల్వే స్టేషన్కు కలుపుతూ ఒక రింగ్ రోడ్డు మంజూరు అయినట్లయితే మిర్యాలగూడ సుమారు 8 కిలోమీటర్ల మేర విస్తరణ చెందుతుంది. దానితోపాటు పట్టణము మరింతగా అభివృద్ధి చెందుతుంది ప్రస్తుత పరిస్థితులు ఇవన్నీ అవసరం లేదనుకుంటే పొరపాటే .మిర్యాలగూడ సాగర్ రోడ్డు ఒక్కటే పెద్దది ఎక్కువగా కనిపిస్తుంది. ఇ క్కడ రహదారులు విస్తరణ చేయాలంటే ప్రజల సహకారం లేకపోవడం ఓట్లు వ్యవహారాలు ఒంటి సమస్యలతో మిర్యాలగూడ బస్టాండ్ నుంచి రాజీవ్ చౌక్, హనుమాన్ పేట వరకే ఇరుకు ఇరుకు ప్రాంతాల్లోనే వ్యాపార సంస్థలు వృద్ధి చెందుతున్నాయి దానివల్ల మిర్యాలగూడ ఒక్క ప్రాంతానికి పరిమితం అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసినట్లయితే మిర్యాలగూడ బైపాస్ అవతలికి వృద్ధి చెంది వ్యాపార సంస్థలను పోవడంతో పాటు మిర్యాలగూడ రహదారులు ప్రశాంతంగా తో పాటు పదిమందికి ఉపయోగకరంగా ఉంటుంది. స్థానికంగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకుని జిల్లాకు ఉన్న ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఉత్తంకుమార్ రెడ్డి లతో సమన్వయం చేసుకుంటూ ఆయన పేరు చిరస్థాయిలో నిలబడాలంటే ఔటర్ రింగ్ రోడ్డు ఒకటి మంజూరు చేయించాలి అని ప్రజలు కోరుతున్నారు.. మిర్యాలగూడ- మద్రాస్ – హైదరాబాద్ కు మధ్య ప్రాంతంలో ఉండడంతో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి .ఈ సందర్భంలో ఉన్న ఒక్క బైపాస్ లో నెలలో మూడు రహదారులు ప్రమాదాలు జరుగుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు ఇటువంటి సమస్యలను కూడా అధికమించడానికి ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. అధికారులు ఈ విషయంలో లోతుగా విశ్లేషించాలి ప్రజాప్రతితులు రాజకీయ పార్టీలకు తావు లేకుండా అభివృద్ధి పై దృష్టి సారించాలి మిర్యాలగూడ మను మరో మని మకుటం వృద్ధి చెందుతున్న సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు ఎంతైనా అవసరం ఆ మణిమకుటమే యాదాద్రి పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వాహనాల రద్దీ అధికమై ప్రజలు ఇబ్బంది పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఈ సందర్భంగా ముందుచూపుతోనే ప్రజాప్రతినిధులు అందరూ పని చేయాలి మన జిల్లాకు సంబంధించిన మంత్రులు మిర్యాలగూడ గాని మిర్యాలగూడ శివారు ప్రాంతాల్లో పర్యటించినట్లయితే వారిని కలిసి వినతులు సమర్పించి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి