మిర్యాలగూడలో ఉన్న రైస్ మిల్లులు అన్ని ధాన్యం కొనుగోలు చేయాలి లేకపోతే వారిపై కఠిన చర్యలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి..ఈరోజు మిర్యాలగూడ రైస్ మిల్స్ ఓనర్స్ తో *రైస్ మిల్లర్స్ అసోసియేషన్* నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి .. మాట్లాడుతూ ఈరోజు నుంచి మిర్యాలగూడలో ఉన్న ప్రతీ రైస్ మిల్స్ లో ధాన్యం కొనుగోలు చేయాలి, కేవలం కొన్ని మిల్స్ మాత్రమే కొనుగోలు చేయడం వలన రైతులు లైన్ లలో వెయిటింగ్ చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు… ధాన్యం కొనుగోలు చేయాలని మిల్స్ పై చర్యలు తీసుకుంటామని అన్నారు.. అలాగే గత రెండు సంవత్సరాలుగా వర్షాలు సరిగా లేక చెరువులు, బోర్లు ఎండిపోయి పంటకి సరైన నీరు అందక రైతులు చాలా నష్ట పోయారు కావున వారికి ధర విషయంలో కూడా రైతులకు లాభం చేకూరేలా చేయాలని అన్నారు.. ఈ సమావేశంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్ మిల్లర అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బోగబెల్లి వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు