పోలిశెట్టి రాంబాబు మృతి*
మిర్యాలగూడ ప్రజాలహరి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన గాయకుడు, లెఫ్టిస్ట్ భావజాలు కలిగిన ప్రముఖ నిర్మాత రియల్ ఎస్టేట్ వ్యాపారి పోలిశెట్టి రాంబాబు వయ సు (61) గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంతో హైదరాబాదులోని నిమ్స్ హాస్పటల్లో జాయిన్ అయ్యారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు మృతుడు రాంబాబు గోపి గోడ మీద పిల్లి ,లక్ష్మీ పుత్రుడు వంటి సినిమాలకు నిర్మాతగా ప్రజానాట్యమండలి కళాకారులుగా పలు కార్యక్రమాలలో చురుకైన పాత్ర వహించారు మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పేరు ప్రఖ్యాతిని సంపాదించారు ఆయన మరణ వార్త విన్న మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అతని మృతి పట్ల వారి మిత్రులు గుంటోజు వీరాచారీ పొదిల సత్యనారాయణ దీకొండ ప్రసాద్ గుంటోజు సతీష్ కోల సైదులు కన్నీటి పర్యంతమయ్యారు