హైదరాబాద్ ఉత్తర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నేషనల్ హైవే కారిడార్ని శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దశాబ్దాల కలకు నేడు మొదటి అడుగు
మిర్యాలగూడ ప్రజాలహరి హైదరాబాద్
హైదరాబాద్ ఆల్వాల్ ప్రాంతం నుండి కరీంనగర్, ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనాలకు లక్షలాది ప్రజలకు సౌకర్యవంతంగా ఉండడానికి ముఖ్యమంత్రి గారు ఎలివేటర్ కారిడార్ కి శంకుస్థాపన చేశారు..
ఈ ప్రాంత ప్రజలు వారి గమ్యస్థానం నుండి ఇక్కడికి రావడం ఓక ఎత్తైతే ఇక్కడి నుండి సిటీలోకి వెళ్లడానికి అంతే సమయం పట్టే పరిస్థితి ఉండేది…
ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యను ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తున్నారు..
ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఎలివేటర్ కారిడార్ కి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు..
హైదరాబాద్ – కరీంనగర్ రాజీవ్ రహదారిపై
సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారి(SH01) ఎలివేటెడ్ కారిడార్ భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి , సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , మానకొండుర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది