అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది కేసీఆర్…. ప్రజాలహరి హైదరాబాద్
త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ గెలువబోతున్నదని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12న సెంటిమెంట్‌గా వస్తున్న ఎస్సారార్ కాలేజీ గ్రౌండ్స్‌లో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్‌ఎస్ గెలువబోతుందన్నారు. అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్న ఆయన.. బీఆర్‌ఎస్‌తో మేలు జరుగుతుందనే చర్చ మొదలైందన్నారు. శాసన సభ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దని శ్రేణులకు సూచించారు. నేతలు, కార్యకర్తలు అధైర్యపడొద్దని సూచించారు. నేతలంతా కలిసి పని చేయాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో గతంలో బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ విమర్శించిందని గుర్తు చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామని మాట ఇచ్చిందన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నీళ్లు, కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజమని.. మధ్యమానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పూనుకొని పరిష్కరించాలని.. ఒక పన్నుపాడైతే.. చికిత్స చేసుకుంటాం తప్ప.. మొత్తం పళ్లన్నీ పీకి వేసుకోలేం కదా? అన్నారు.