మండలంలో పలు గ్రామాల్లో సిసి రోడ్డు పనులు ప్రారంభం
వేములపల్లి( ప్రజాలహరి) వేములపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో రావులపెంట, కామేపల్లి , శెట్టిపాలెం, రావు వారి గూడెం గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 20 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులు నిర్మాణానికి వేములపల్లి ఎంపీపీ సునీత శుక్రవారం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సహకారంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో మండలంలోని పలు గ్రామాలకు రోడ్డు పనులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించారని ఆమె ను కొనియాడారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఆమె అన్నారు అభివృద్ధిలో భాగంగా నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తధానంతరం 6 గ్యారంటీలలో నాలుగు గ్యారెంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనిని కొనియాడారు. ముఖ్యంగా రానున్న ఐదు సంవత్సరాలలో స్థానిక శాసనసభ్యులు సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల్లో అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు రావు ఎల్లారెడ్డి, రావులపెంట గ్రామ శాఖ కార్యదర్శి బీర్లు సతీష్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచులు శ్రీనివాస్, మరి ఏలియాస్, ఎస్సీ సెల్ జిల్లా వైస్ చైర్మన్ పుట్టల శ్రీనివాస్, కృపయ్య మండల కాంగ్రెస్ నాయకులు చలబట్ల శ్రీనివాస్ రెడ్డి, శీలం శీను, నల్ల మేకల నరసయ్య, తదితరులు పాల్గొన్నారు