కామ్రేడ్ నంద్యాల శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం నంద్యాల భవన్ ఏర్పాటు.
. మిర్యాలగూడ ప్రజాలహరి…. దొర కుటుంబంలో జన్మించిన అదే దొరలపై ,భూస్వామ్య పై తిరుగుబాటు చేసిన మహనీయుడు పేదల కార్మిక వ్యవసాయ కూలి ల ఆపద్బాంధవుడు కామ్రేడ్ నంద్యాల శ్రీనివాసరెడ్డి జ్ఞాపకార్థం మిర్యాలగూడ పట్టణంలో సిఐటియి భవనం లో 22 లక్షల రూపాయలతో నూతన భవనం ఏర్పాటు చేస్తున్నట్లు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూల కంటి రంగారెడ్డి, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి కుమారుడు నంద్యాల కృపాకర్ రెడ్డి లు పేర్కొన్నారు.
స్వర్గీయ కామ్రేడ్ నంద్యాల శ్రీనివాస్ రెడ్డి జన్మ తహ దొ రలు కుటుంబం .వందల ఎకరాల గల ఆస్తులు ఉన్నాయి ఆయన కమ్యూనిస్టు పార్టీలో రాజకీయం జీవితం మొత్తం గడిచిపోయింది. ఆయన భూస్వామ్య వ్యవస్థ పెత్తందారి వ్యవస్థ వ్యతిరేకంగా వారి కుటుంబం పైనే దాడులు చేసిన నిస్వార్ధ శ్రామిక సేవకుడు .ఆయన దొరలు జమీన్లకు వ్యతిరేకంగా పోరాటాలు కారణంగా రెండు సార్లు ఉరిశిక్షపడింది. లండన్ నుంచి ప్రముఖ న్యాయవాదులు వచ్చి ఆయన్ని తప్పించారు .ఒక సందర్భంలో ఉరిశిక్ష ఖరారు కోసం హైకోర్టుకు వేళా అక్కడి నుంచి తమ తోటి సహచరుడు మల్లు వెంకట నరసింహారెడ్డి ఆయన కలిసి పోలీసుల కన్నుగప్పి తప్పించుకొని పారిపోయారు. తర్వాత జరిగిన భారత జాతీయ ఉద్యమంలో హైదరాబాదును భారత్లో కలిపిన అనంతరం జరిగిన ఎలక్షన్స్ లో నకిరేకల్ పిడిఎఫ్ ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందారు. ఆయన ఆస్తిని పేదలకు పంపిణీ చేశారు. సమకాలిక రాజకీయాలు ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు కమ్యూనిస్టుల ఉద్యమ పోరాటాలకు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు ఆయన సేవలు ప్రశంసనీయమని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే అన్నారు ఆయన కుమారులు ఆయన జ్ఞాపకార్థం నంద్యాల భవన్ కు సుమారు 22 లక్షల రూపాయలు ఇచ్చారని భవన నిర్మాణం పూర్తికాగానే నంద్యాలభవంగా నామకరణం చేస్తామని చెప్పార. ఈ భవన్లో వారి మనవరాలు వైద్య వృత్తుల ఉన్నారని వారితో పాటు మరి కొంతమంది సహకారంతో కార్మికులకు హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తామని చెప్పారు .