*మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి పాలాభిషేకం.*
ఈరోజు మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి క్యాంప్ కార్యాలయం నందు *మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 500 రూపాలకే గ్యాస్ సిలిండర్ మరియు గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను* ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకులు మరియు మహిళలు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నర నెలల్లోనే 4 పథకాలను అమలు చేసింది.. కచ్చితంగా ఇచ్చిన హామీ ప్రకారం 100 రోజుల్లో అరు గ్యారెంటీలను అమలు చేస్తుంది అని అన్నారు… తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే ప్రజా పాలన ప్రారంభమైంది ప్రజల ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అని అన్నారు.. ఈ కార్యక్రమంలో పట్టటణ కాంగ్రెస్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ,అర్జున్ తదితరులు పాల్గొన్నాారు..