Ultimate magazine theme for WordPress.

మార్చి 2న రామచంద్ర గూడెంలో కామ్రేడ్ గాదె శ్రీనివాస్ రెడ్డి విగ్రహావిష్కరణ

Post top

మిర్యాలగూడలో స్వర్గీయ కామ్రేడ్ గాదే శ్రీనివాసరెడ్డి విగ్రహం ఏర్పాటు కు సన్నాహాలు… మిర్యాలగూడ ప్రజాలహరి…….. మిర్యాలగూడ రాజకీయ ముక్క చిత్రంలో గాదే శ్రీనివాసరెడ్డి పాత్ర ప్రముఖ స్థానంలో కనిపిస్తుంటుంది .ఈ ప్రాంతంలో రజాకార్ల పోరాట అనంతరం కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య అధికంగా ఉండేది. దోపిడి గురవుతున్న పేదల పక్షాన కమ్యూనిస్టు నాయకత్వం వహిస్తూ వారికోసం భూ పోరాటాలు చేసేవారు. మిర్యాలగూడ, నకిరేకల్ మరియు నల్గొండ జిల్లాలో తోపు చర్ల, చిరుమర్తి పిర్కా అగ్రస్థానంలో నిలబడుతుంది. ఇక్కడ భూస్వామ్య ల కు, దొరలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి. వాటికి కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించేవారు . గ్రామాల్లోకాంగ్రెస్- కమ్యూనిస్టు ల మధ్య పోరు అధికంగా ఉండేది. గాదే శ్రీనివాస్ రెడ్డి ,జూలకంటి రంగారెడ్డి, గటి కొపుల రాo రెడ్డి , రాగిరెడ్డి వీరారెడ్డి, బిక్షా నాయక్ లు వీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి నడుం బిగించారు. వీరు దెబ్బకు కాంగ్రెస్ పార్టీ నాయకులు హడాలెత్తిపోయారు .ఆ సందర్భంలోనే కమ్యూనిస్టు పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలను చంపేశారని పుకార్లు ఉన్నాయి గ్రామాల్లో కమ్యూనిస్టులు- కాంగ్రెస్లు. పోటాపోటీగా పార్టీ నిర్మాణంకోసం పని చేశారు .ఇందులో శ్రీనివాస్ రెడ్డి పాత్ర ప్రముఖo కమ్యూనిస్టులకు పెద్దపీట వేయడానికి శ్రీనివాస్ రెడ్డి విశేషంగా కృషి చేశారు. గాదె శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో కల్లేపల్లి, బాపూజీ నగర్, ప్రకాష్ నగర్ ,సుందర్ నగర్ ప్రాంతాల్లో పేదలకు భూములు, ఇళ్ల స్థలాలు పంపిణీలలో ఆయన పాత్ర అజరామరo.ఈయన స్వగ్రామం వేములపల్లి మండలం ఆమనగల్లు శివారు లక్ష్మీదేవి గూడెం, అత్తగారు మునగాల గ్రామం వీరికి ఒక భార్య, ఇద్దరు కొడుకులు భార్య గాదే పద్మ గారు కమ్యూనిస్టు పార్టీలో మహిళా సంఘం జిల్లా నాయకురాలుగా అనేక పోరాట ఉద్యమాలు పాల్గొంటున్నారు. ఆయన రాజకీయ చతురతకు కాంగ్రెస్ వారు కాకావికులమయ్యేవారు. ఒక సందర్భంలో మిర్యాలగూడలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏ పార్టీ వారు జెండాలు కప్పుకుని తిరిగి పరిస్థితి ఉండకపోయేది .ఆ సందర్భంలో గాదె శ్రీనివాస్ రెడ్డి కమ్యూనిస్టుల ప్రాబల్యానికి విశేషంగా కృషి చేశారు. కార్యకర్త పిలుపు, పార్టీ పిలుపుతో నిత్యం ప్రజల కోసం తిరుగుతుండేవారు. 1982  మార్చి 2న నలగొండలో పార్టీ వ్యవహారాలపై నల్లగొండకు వెళ్లిన గాదె శ్రీనివాసరెడ్డి బస్సు దిగి కమ్యూనిస్టు పార్టీ కార్యాలయానికి వెళ్తుండగా కొంతమంది విచ్చర్నకరణ శక్తులు ఆయనపై గొడ్డళ్లు, వేట కత్తులు తో దాడి చేసి చంపేశారు. గాదె శ్రీనివాసరెడ్డి మరణించి సుమారు 42 సంవత్సరాలు కావస్తుంది. ఆయన మరణం ప్రజల గుండెల్లో స్థిరంగా ఉండాలని స్థానిక రామచంద్రగూడెం శివారులో ఆయనకు స్మారకస్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల మిర్యాలగూడ కమ్యూనిస్టులు, అభిమానులు కార్యకర్తలు మార్చి 2న గాదే శ్రీనివాస్ రెడ్డి వర్ధంతి సందర్భంగా స్తూపం వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

post bottom

Leave A Reply

Your email address will not be published.