*నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఉన్న చెరువులను కుంటలను వెంటనే నింపాలి*
*మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి*
మిర్యాలగూడ ప్రజాలహరి. ఈరోజు దామరచర్ల మండలం కేంద్రంలో ఉన్న చెరువులను పరిశీలించి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న చెరువులను కుంటలను నింపి తాగునీరు ఎద్దడిని నివారించాలని పలు చెరువులను పరిశీలన చేస్తూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమకాల పరిధిలో మంచినీటి ఎద్దడి ప్రారంభమైంది చెరువులు పూర్తిగా ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటుపై మంచినీటి బోర్లు ఎండిపోయి త్రాగడానికి నీరు లేక ప్రజలు చాలా దూరం నుండి ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు కూడా అన్ని గ్రామాలలో పూర్తిస్థాయిలో రావడం లేదు. ఇటీవల సాగర్ నుండి ఖమ్మం జిల్లా పాలేరు ప్రాజెక్టుకు ముందు జాగ్రత్తగా నీటి విడుదల చేసిన విషయం తెలిసింది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో గ్రామాలలో చెరువులకు కూడా ఈ విధంగా మీరు నీరు విడుదల చేసి నింపినట్లైతే ఈ ప్రాంతాలలో భూగర్భ జలాల లభ్యత వలన తిరిగి చేతిపంపు బోర్లు ద్వారా త్రాగునీటి సౌకర్యం ఏర్పడే అవకాశం ఉంది. వేసవి ప్రారంభంలోనే ఇంత నీటి కొరత ప్రారంభమైందున నిండు వేసవిలో పరిస్థితి మరింత తీవ్రత ఏర్పడే అవకాశం ఉంది అన్నారు. అదేవిధంగా కొంతమంది రైతులు బోర్లపై ఆధారపడి వేసుకున్న పంట పూర్తిగా ఎండిపోవడం జరిగింది అట్టి పంటను గొర్లు పశువులు మేపడం జరుగుతుంది. కావున రెవిన్యూ మరియు వ్యవసాయ అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని గుర్తించి వారికి నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుండి పరిహక ప్రాంతాలలో చెరువులను నింపి తద్వారా భూగర్భ జలాల నీటితో ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ రైతు సంఘం జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు పార్టీ మండల కార్యదర్శి వినోద్ నాయక్ సీనియర్ నాయకులు పాపా నాయక్ దయానంద్ ఎర్రనాయక్ కోటిరెడ్డి సుభాని గోపి వెంకట్ రెడ్డి విజయ్ రవి బాలు పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.