రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి నిన్న(శనివారం) రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతుల ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేయడంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో.. ఐజీ స్టీఫెన్ రవీంద్ర కు అడిషనల్ డీజీపీగా పదోన్నతి కల్పించారు. హైదరాబాద్ క్రైమ్స్ లో డీఐజీ గా పనిచేస్తున్న ఏవి. రంగనాథ్ కు, సీఏఆర్ లో డీఐజీగా పనిచేస్తున్న వి.సత్యనారాయణ, రామగుండం సీపీ గా పని చేస్తున్న ఎం. శ్రీనివాస్, ఎస్ఐబీ చీఫ్ గా పని చేస్తున్న బడుగుల సుమతి, టూరిజం ఎండీగా పనిచేస్తున్న రమేష్ నాయుడు, ఇంటలిజెన్స్ లో డీఐజీ గా పనిచేస్తున్న కార్తికేయలకు ఐజీగా పదోన్నతి కల్పిస్తూ యథ స్థానంలో పనిచేసే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. డీఐజీలుగా పనిచేస్తున్న న్యాలకొండ ప్రకాష్ రెడ్డి, జోయల్ డేవిస్ లకు సూపర్ టైమ్ స్కేల్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.