నేడే గంగమ్మ తల్లి జాతర
వస్తావని గంగమ్మ
వేములపల్లి (ప్రజాలహరి) వేములపల్లి మండలంలోని బుద్ధి రాయగడ గ్రామ శివారులో యాదవుల ఆరాధ్య దైవమైన గంగమ్మ ఆలయ జాతరకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.యాదవ కులస్తులకు చెందిన పూర్వీకులు మండల కేంద్రంలోని బుగ్గ వారి గూడెం సమీపంలో నార్కట్పల్లి అద్దంకి రహదారి పక్కనే ఉన్న గుట్టపై అమ్మవారి కొలువు తీరగా జాతరకు రథస్థమి అనంతరం వచ్చే మాఘ పౌర్ణమి నాడు ఈ జాతరను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. గతంలో గుట్టపై చిన్నదిగా ఉన్న అమ్మవారి గుడిని 32 ఏళ్ల కిందట పునర్ నిర్మించుకొని యాదవులు జాతరను కొనసాగిస్తున్నారు. ప్రధాన రహదారి నార్కట్పల్లి అద్దంకి రహదారి పక్కనే ఈ ఆలయం ఉండటంతో వాహన సేవకులు, బాటసారిలు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కలు తీసుకుంటారు. ప్రభుత్వపరంగా దేవాలయ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం యాదవులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తక్షణమే దేవాలయ అభివృద్ధి శాఖ ద్వారా నిధులు కేటాయించి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని భక్తులు కోరుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి జాతర ప్రారంభమవుతుంది. యాదవులు ఆరాధ్య దైవమైన గంగమ్మ జాతరను ఆదివారం అర్ధరాత్రి నుంచి యాదవులు తమ తమ ఇండ్ల నుంచి పూజా సామాగ్రిని గంపలతో బయలుదేరడంతో జాతర ప్రారంభమవుతుంది నీ జాతర పరిసర గ్రామాల్లోని వేములపల్లి, బొగ్గుబాయి గూడెం, కుక్కడం, చింతలగూడెం, గండ్ర వాని గూడెం, తిమ్మారెడ్డి గూడెం, అన్నపురెడ్డిగూడెం, గోగు వారి గూడెం తదితర గ్రామాల యాదవ కుటుంబాలు భక్తులు సతీ సమేతంగా డప్పు వాయిద్యాలతో కాళ్లకు గజ్జలు కట్టుకొని గంపలెత్తుకొని, హోలింగ హోలింగా అంటూ దేవతలకు బుక్కు తీర్చుకునేందుకు పుట్ట వద్దకు భక్తిశ్రద్ధలతో చేరుకుంటారు. అనంతరం సోమవారం ఉదయం గుట్ట వద్దకు చేరుకొని వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు యాదవ సోదరులు తీసుకొచ్చినటువంటి బియ్యాన్ని ఒకే చోట రాసిగా పోసి అనంతరం రాశి నుంచి సేకరించిన బియ్యంతో రాసి భోజనం వండి అమ్మవారికి గ్రామానికి చెందిన రేఖ కుటుంబము , వేములపల్లి గ్రామానికి చెందిన చిర్రా కుటుంబం అమ్మవారికి తొలి భోజనం సమర్పించడంతో జాతర ప్రారంభమవుతుంది. దీంతో వివిధ గ్రామాల నుంచి వచ్చే భక్తులతో జాతర ప్రాంగణంలో సందడి మొదలవుతుంది దేవాదాయ అభివృద్ధికి ప్రభుత్వ సహాయం అందించాలని రేఖ కృష్ణమూర్తి ఆలయ చైర్మన్ యాదవుల ఆరాధ్య దైవం అయిన గంగమ్మ దేవాలయాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వము ఆర్థిక సాయం అందించాలి. నిత్యం పూజలు చేసేందుకు ధూప దీప నైవేద్యాలను సమర్పించేందుకు అవసరమైన నిధులు విడుదల చేసినట్లయితే భక్తులకు సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని రహదారి ఆనుకొని ఉండటంతో తీర్చిదిద్దినట్లయితే బాటసారిల సైతం సేద తీసుకునేందుకు వీలుంటుంది అన్నారు