ప్రజాలహరి క్రైమ్ మిర్యాలగూడ
పోలీస్ స్టేషన్కు మాత్రమే పరిమితమైన ట్రాఫిక్ పోలీసులు ఉదయం కాసేపు సాయంత్రం కాసేపు చలాన్లు వసూలు చేసి మిగతా పట్టణంలో ఏ రోజు ఏ సమయంలో కూడా కనిపించని పోలీసులతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అస్సలు ఇష్టమైన ట్రాఫిక్ ను చూసి వాహన చోదకులు భయపడుతున్నారు మిర్యాలగూడ రోడ్లమీదకి రావాలంటేనే పద్మవ్యూహంలోకి వచ్చినట్లు భ్రమ పడుతున్నారు వివిధ పల్లెటూర్ల నుండి ఎన్నో రకాల కార్యకలాపాలకు ఎన్నో రకాల అవసరాలకు మిర్యాలగూడకు వస్తున్న ప్రజానీకానికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నదా అని భ్రాంతికి లోనవుతున్నారు కానీ ట్రాఫిక్ పోలీసులకు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఎన్నోసార్లు పత్రిక ముఖంగా గాని ఫిర్యాదులు చేసిన పట్టించుకోని అధికార ఘనం ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు అధికార గణం మేల్కొని ట్రాఫిక్కును రోడ్ల పైన నిలుచున్న వాహనాలను సరి చేసే ప్రయత్నం చేస్తారని మిర్యాలగూడ పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు